మనిషికి అప్పు అనేది చాలా ప్రమాదకరమైనది. ఈ అప్పుల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలానే ఎందరో అప్పులు తీర్చలేక మానసిక వేదనకు గురై.. చివరకు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఘోరమైన ఘటన చోటుచేసుకుంది. తండ్రి బకాయిలు చెల్లించలేదని ఆయన 16 ఏళ్ల కుమార్తెను ఓ 52 ఏళ్ల వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. బీహార్ లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఆ బాలికకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా, అప్పు తీర్చలేక బలవంతంగా తండ్రే వివాహం జరిపించాడు. పెళ్లి అనంతరం బాధిత బాలిక ఓ వీడియో చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..
బాధితురాలి పుట్టింటి వారు జార్ఖండ్ లోని గోడ్డా జిల్లాలో ఉంటారు. ఆ బాలిక తల్లి గతేడాది డిసెంబరులో మృతి చెందింది. తన తండ్రి మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. అతడు వివిధ సందర్భాల్లో భారీగా అప్పులు చేశాడు. ఆ అప్పులు సంఖ్య బాగా పెరగడంతో మానసిక వేదనకు గురయ్యాడు. ఆ బాలిక తండ్రికి అప్పు ఇచ్చిన వ్యక్తి తిరిగి చెల్లించమని అడిగాడు. అలా చెల్లించలేని పక్షంలో నీ కుమార్తెతో వివాహం జరిపించాలని డిమాండ్ చేశాడు. అతడి మాటలకు బాలిక సవతి తల్లి వత్తాసు పలికింది.
తనకు వివాహం ఏమాత్రం ఇష్టం లేదని సదరు బాలిక తిరస్కరించింది. గత జులైలో బలవంతగా ఆ 52 ఏళ్ల వ్యక్తి వివాహం జరిపించారు. పెళ్లి అనంతరం ఆ బాలిక అత్తగారి ఊరైన భాగల్ పూర్ చేరుకున్నారు. పెళ్లైన కొన్ని రోజులకే ఆ బాలికను ఆమె భర్త నిత్యం కొడుతుంటాడని, నిందిస్తుండాని బాధితురాలు తెలిపింది. తుపాకీ చూపించి..తనతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నాడని బాధితురాలు తెలిపింది. ఈ వేధింపులను తాను భరించలేకపోతున్నానని వీడియో పేర్కొంది.
ఆ బాలిక.. తన భర్త, తండ్రి, సవతి తల్లిపై ఫిర్యాదు చేసేందుకు మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్లగా..తమ పరిధిలోకి రాదని ఆమెనుి పంపించి వేశారు. దీంతో బాధితురాలు నేరుగా డీఐజీ ఆఫీస్ కు వెళ్లి.. అక్కడి వారికి తన ఆవేదనను తెలియజేసింది. వారు కూడా పట్టించుకోక పోవడంతో విసుకు చెందిన బాలిక.. ఓ వీడియో రూపొందించి, సోషల్ మీడియాలో షేర్ చేసింది. చివరకు భాగల్ పూర్ ఎస్పీ కార్యాలయంకు చేరి.. వారు స్పందించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మరి.. ఈ దారుణ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తల్లితో కలిసి కుమారుడి గలీజ్ దందా! మైనర్ ను సైతం వదలకుండా..!