iDreamPost
android-app
ios-app

ఓవరాక్షన్ ట్రైనీ IAS గుట్టురట్టు! కోట్ల ఆస్తి పెట్టుకుని పూజ ఘరానా మోసం?

తనకు ప్రత్యేక అధికారాలివ్వాంటూ కలెక్టర్‌కు లేఖ రాసి తీవ్ర విమర్శల పాలైన ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ విషయంలో విస్తుపోయే విషయాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అలాగే ఆమె నియామక ప్రక్రియపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

తనకు ప్రత్యేక అధికారాలివ్వాంటూ కలెక్టర్‌కు లేఖ రాసి తీవ్ర విమర్శల పాలైన ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్ విషయంలో విస్తుపోయే విషయాలు ఒకొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అలాగే ఆమె నియామక ప్రక్రియపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఓవరాక్షన్ ట్రైనీ IAS గుట్టురట్టు! కోట్ల ఆస్తి పెట్టుకుని పూజ ఘరానా మోసం?

ప్రజలకు సేవలందించాల్సిన హోదాలో ఉంటూ ఓవరాక్షన్ చేసి వార్తల్లో నిలిచింది ట్రైనీ ఐఏఎస్ ఆఫీసర్ పూజా ఖేడ్కర్. 2023 యుపీఎస్పీ ఫలితాల్లో 841 ఆల్ ఇండియా ర్యాంక్ సాధించిన పూజా మహారాష్ట్రలోని పూణెలో ట్రైనీ ఐఏఎస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టింది. ప్రొబేషన్ పీరియడ్‌లో ఉన్న సమయంలో ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడింది. తన ప్రైవేట్ ఆడికారుకు బుంగ (రెడ్ అండ్ బ్లూలైట్)తో పాటు వీఐపీ నెంబర్ ప్లేట్స్‌తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం అనే బోర్డును ఏర్పాట్లు చేసుకుంది. అంతేకాకుండా అదనపు కలెక్టర్ కార్యాలయాన్ని ఆ అధికారి అనుమతి లేకుండా తీసుకుంది. కుర్చీలు, సోపాలు, టేబుల్స్ వినియోగించడం మాత్రమే కాదు..తన నేమ్ బోర్డు కూడా అమర్చుకుంది. ఇక్కడితో ఆగిపోకుండా.. తనకు కొన్ని ప్రత్యేక అధికారాలు కావాలంటూ ఏకంగా కలెక్టర్‌కు లేఖ రాసింది. ఆమె చర్యలపై విసుగుపోయిన కలెక్టర్.. ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేయడంతో ఆమె ట్రాన్స్‌ఫర్ అయ్యింది.

పూజా ఇప్పుడు వార్తల్లో నిలవడంతో ఆమె మానసిక బలహీనతతో ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే క్రమంలో యుపీఎస్సీలో ఆమె నియమాక ప్రక్రియపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఆమె వికలాంగుల కోటా కింద ఉద్యోగం పొందడంపై ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఆమెకున్న ఆస్తి వివరాలు తెలిసి విస్తుపోవడం అధికారుల వంతౌతుంది. దివ్యాంగురాలిగా పేర్కొంటూ ఉద్యోగం పొందినట్లు తెలుస్తుంది. అయితే వైద్య పరీక్షలను పలుమార్లు స్కిప్ చేసింది. అంతేకాదు.. తన తండ్రితో విడిపోయానని చెప్పిన పూజా.. ఓబీసీ (నాన్ క్రిమిలేయర్) కోటాలో ఉద్యోగానికి ఎంపికైనట్లు సమాచారం. ఇదంతా ఒక ఎత్తైతే తండ్రి కూడా తన కూతురు డిమాండ్లను నేరవేర్చాలంటూ ఒత్తిడి తీసుకురావడం గమనర్హం. దీంతో పూణె కలెక్టర్ సుహాస్ దివాసే.. సీఎస్‌కు లేఖ రాశాడు. దీంతో బదిలీ ఉత్తర్వులు వచ్చాయి.

Trainee IAS Pooja

మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. ఆమెకు రూ. 100 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఇండియా టుడే చెబుతున్న ఆస్తి వివరాల ప్రకారం..‘110 ఎకరాల వ్యవసాయ భూమి, ఆరు షాపులు, ఏడు ఫ్లాట్స్ ఉన్నాయి. 900 గ్రాముల గోల్డ్, వజ్రాభరణాలు, రూ.17 లక్షల గోల్డ్ వాచ్, ఆడితో సహా నాలుగు లగ్జరీ కార్స్, రెండు కంపెనీల్లో పార్టనర్ షిప్, ఆమె పేరు మీదే రూ. 17 లక్షలు, ఆమె తండ్రికి వ్యవసాయ భూమి నుండి రూ. 48 లక్షలు అందుతున్నాయి. అలాగే గతంలో పూజ తండ్రి గతంలో ఓ ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో ఎన్నికల అఫిడవిట్‌లో రూ. 40 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నాడు. పూజా, ఆమె తండ్రికి అధికారికంగా రూ. 60 కోట్లు ఉన్నాయి’ అని చెబుతుంది.ఇన్ని ఆస్తి ఉండి నాన్ క్రిమిలేయర్ కింద అలాగే ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్ కింద ఉద్యోగాన్ని పొందడంపై విమర్శలు మొదలయ్యాయి. ప్రస్తుతం పూజాను వాషిమ్‌కు బదిలీ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. అంతేకాదు తన ప్రొబెషనరీ పీరియడ్ ముగిసే వరకు.. అక్కడే సూపర్ న్యూమరీ అసిస్టెంట్ కలెక్టర్‌గా పని చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై విచారణ జరుగుతోంది.