iDreamPost
android-app
ios-app

క్రికెటర్ ఇంట్లో విషాదం.. మెడపై కత్లిపోట్లతో తల్లి అనుమానాస్పద మృతి..!

టీమిండియా మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె ఫ్లాట్ లో విగత జీవిగా కనిపించింది.

టీమిండియా మాజీ క్రికెటర్ సలీల్ అంకోలా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఆమె ఫ్లాట్ లో విగత జీవిగా కనిపించింది.

క్రికెటర్ ఇంట్లో విషాదం.. మెడపై కత్లిపోట్లతో తల్లి అనుమానాస్పద మృతి..!

మాజీ క్రికెటర్, నటుడు సలీల్ అంకోలా ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తల్లి మాల అశోక్ అంకోలా అనుమానాస్పద రీతిలో మరణించారు. పూణేలోని ప్రభాత్ రోడ్‌లో ఉన్న తన ఫ్లాట్‌లో శవమై కనిపించింది. ఆమె మెడపై కత్తితో పొడిచిన ఆనవాళ్లు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇల్లు చిందర వందరగా లేకపోవడంతో పాటు ఆమె ఒంటిపై కత్తి గాట్లు ఉండటంతో ఇది హత్యా లేక ఆత్మహత్యా సందిగ్ధత నెలకొంది. డెక్కన్ ప్రాంతంలోని ఆది బిల్డింగ్‌లోని తన ఫ్లాట్‌లో మాలా అంకోలా ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు సమీపంలో నివసిస్తోంది కూతురు. ఆమె తరచూ తల్లి వద్దకు వచ్చి చూసి వెళుతుండేది. శుక్రవారం ఇల్లు శుభ్రం చేసేందుకు మాలా ఇంటికి వచ్చింది పనిమనిషి. కాలింగ్ బెల్ కొట్టగా ఆమె తలుపు తీయలేదు. ఆమె స్పందించకపోవడంతో సమీపంలోనే ఉన్న కూతురికి సమాచారం అందించింది

కూతురు తన దగ్గర ఉన్న స్పేర్ కీని పంపగా.. తలుపు తీసింది పనిమనిషి. మంచంపై క్రికెటర్ తల్లి అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని చూసి కూతురికి సమాచారం అందించింది. గొంతుపై పదునైన ఆయుధంతో పొడిచిన గుర్తులు ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ.. చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మాజీ క్రికెటర్ కమ్ నటుడు తన తల్లి మరణ వార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. గుడ్ బై మామ్ అంటూ బ్రేకెన్ హార్ట్ సింబల్ ఎమోజీతో పోస్టు రాశాడు. కాగా, అయితే ఆమె మరణంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. మెడపై కత్తి పోట్లు ఉండటంతో మృతురాలు గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చునన్న ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పోలీసులు. అలాగే సీసీటీవీ కెమెరా పనిచేయకపోవడంతో హత్య కోణంలో కూడా విచారిస్తున్నారు.

ఇక సలీల్ అంకోలా క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే. మాస్టర్ బ్లాస్టర్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఎంట్రీ సమయంలోనే సలీల్ కూడా అరంగేట్రం చేశాడు. నవంబర్ 15, 1989న ఇండియా తరుఫున తొలి టెస్ట్ మ్యాచ్ ఆడాడు సలీల్. ఆ మ్యాచ్‌లో సలీల్ రెండు ఇన్నింగ్స్ ఆడి వికెట్స్ తీశాడు. అదే ఏడాది వన్డే జట్టులోకి ప్రవేశించాడు. ఇంచు మించు సచిన్ టెండ్కూలర్‌తో పాటుగా ఆయన క్రికెట్ కెరీర్ స్టార్ అయ్యింది. కానీ ఎనిమిదేళ్లకే.. 29 ఏళ్లకే ఆటకు గుడ్ బై చెప్పేశాడు. తన కెరీర్‌లో ఒక టెస్ట్ మ్యాచ్, 20 వన్డేలు మాత్రమే ఆడాడు. 1997లో క్రికెట్‌ను వీడి నటుడిగా మారాడు. బాలీవుడ్ లో అడుగుపెట్టిన సలీల్.. కురక్షేత్ర, చురలియా హై తుమ్నే, రియావత్, ఏక్తా ద పవర్ వంటి చిత్రాలతో పాటు సీఐడీతో పాటు పలు టెలివిజన్ సీరియల్స్, పలు రియాలిటీ షోల్లో పారిస్టిపేట్ చేశాడు.