Venkateswarlu
పిల్లలు ఎంతో ఇష్టం ఇంటికి వచ్చారు. తల్లి కోసం కేకలు వేస్తూ ఇంట్లోకి అడుగుపెట్టారు. అక్కడి దృశ్యం చూసి వారంతా షాక్ అయ్యారు. ఆమె నట్టింట్లో శవంలా పడి ఉంది.
పిల్లలు ఎంతో ఇష్టం ఇంటికి వచ్చారు. తల్లి కోసం కేకలు వేస్తూ ఇంట్లోకి అడుగుపెట్టారు. అక్కడి దృశ్యం చూసి వారంతా షాక్ అయ్యారు. ఆమె నట్టింట్లో శవంలా పడి ఉంది.
Venkateswarlu
ఈ మధ్య కాలంలో నేరాలు బాగా పెరిగిపోయాయి. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా హత్యల రేటు బాగా పెరుగుతోంది. క్షణికావేశంలో కొన్ని.. పక్కా ప్లాన్‌లతో ఇంకెన్నీ హత్యలు జరుగుతున్నాయి. కొన్ని హత్యలు పోలీసులు కూడా కనుక్కోలేని విధంగా జరుగుతున్నాయి. తాజాగా, బెంగళూరులో ఓ దారుణ హత్య జరిగింది. ఓ మహిళను కొంతమంది వ్యక్తులు అత్యంత కిరాతకంగా చంపేశారు. అది కూడా ఆమె ఇంట్లోనే హత్య చేశారు. పిల్లలు ఇంటికి వచ్చి చూసే సరికి మహిళ శవం నట్టింట్లో పడి ఉంది. దీంతో పిల్లలు షాక్‌కు గురయ్యారు.
ఈ సంఘటన శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన నీలమ్ అనే 30 ఏళ్ల మహిళ కర్ణాటక రాజధాని బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీకి భర్తతో పాటు వచ్చి స్థిరపడింది. నీలమ్ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరంతా ఎలక్ట్రానిక్ సిటీలోని బెట్టాడసాన్‌పూర్, సాయిశక్తి బరాంగే బ్లాక్‌లో నివాసం ఉంటున్నారు. ఆమె భర్త దగ్గరలోని ఓ హార్డ్‌వేర్ షాపులో పని చేస్తున్నాడు. పెయింట్ వర్కులు చేస్తూ ఉంటాడు.
ఇక, వారి పిల్లలు దగ్గరలోని ఓ స్కూల్లో చదువుతూ ఉన్నారు. ఉదయం పిల్లలు స్కూలుకు, భర్త పనికి వెళ్లిపోయారు. ఇంట్లో నీలమ్ ఒక్కత్తే ఉంది. స్కూలు అయిపోగానే పిల్లలు ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. అమ్మా, అమ్మా అని అరుస్తూ నట్టింట్లోకి అడుగుపెట్టారు. అక్కడ హాల్లో పడిఉన్న నీలమ్ మృతదేహాన్ని చూసి షాక్ అయ్యారు. గట్టిగా కేకలు పెట్టారు. ఆ అరుపులు విని పక్కింటివారు అక్కడికి వచ్చారు. నీలమ్ చనిపోయిందని ధ్రువీకరించుకున్నాక ఆమె భర్తకు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నీలమ్ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నీలమ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. ఇంట్లోకి చొరబడ్డ ఆ వ్యక్తులు ఆమె గొంతు నులిమి చంపేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆమెను చంపటం వల్ల ఎవరికి లాభం? అన్న కోణంలో విచారణ చేపట్టారు. భర్తపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి, ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.