iDreamPost
android-app
ios-app

ప్రియుడితో కలిసి తల్లిని చంపిన 13 ఏళ్ల బాలిక! ఎందుకంటే?

  • Published Oct 22, 2023 | 11:51 AM Updated Updated Oct 22, 2023 | 11:51 AM

13 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని అతి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత తనకేం తెలియదన్నట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఆ బాలిక చేసిన కిరాతకం వెలుగులోకి రావడంతో  అంతా షాక్ గురవుతున్నారు.

13 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని అతి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత తనకేం తెలియదన్నట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఆ బాలిక చేసిన కిరాతకం వెలుగులోకి రావడంతో  అంతా షాక్ గురవుతున్నారు.

  • Published Oct 22, 2023 | 11:51 AMUpdated Oct 22, 2023 | 11:51 AM
ప్రియుడితో కలిసి తల్లిని చంపిన 13 ఏళ్ల బాలిక! ఎందుకంటే?

ఏపీలో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలిక తన ప్రియుడితో కలిసి తల్లిని అతి దారుణంగా హత్య చేసింది. ఆ తర్వాత తనకేం తెలియదన్నట్లుగా కుటుంబ సభ్యులను నమ్మించే ప్రయత్నం చేసింది. మొత్తానికి ఆ బాలిక చేసిన కిరాతకం వెలుగులోకి రావడంతో  అంతా షాక్ గురవుతున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే?
పోలీసుల కథనం ప్రకారం.. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్ర వరం పరిధిలోని కంబాలపేటలో సిద్దాబత్తుల మార్గరేట్ జులియాన (63), నాగేశ్వరరావు దంపతులు నివాసం ఉండేవారు. ఇద్దరు మంచి ఉద్యోగాలతో జీవితంలో స్థిరపడ్డారు. ఆస్తులు, అంతస్తులు అన్నీ ఉన్నా.. వీరికి పిల్లలు మాత్రం కలగలేదు. దీంతో ఈ భార్యాభర్తలు కాకినాడకు చెందిన ఓ నిరుపేద కుటుంలోని ఓ నెలల పసిపాపను 13 ఏళ్ల కిందట తెచ్చుకుని పెంచుకున్నారు. కాదనకుండా అడిగిందల్లా కొనిచ్చి ఆ బాలికను గారబంగా పెంచుకున్నారు. ఇదిలా ఉంటే.. రెండేళ్ల కిందట భర్త నాగేశ్వరరావు అనారోగ్యంతో కన్నుమూశాడు. అప్పటి నుంచి జులియాన కూతురుని చూసుకుంటూ ఉండేది.
కాగా, ఆ చిన్నారి పెరిగి 13 ఏళ్ల వయసుకొచ్చింది. ఈ క్రమంలోనే ఆ బాలిక స్థానికంగా ఉండే ఓ యువకుడితో ప్రేమ వ్యవహారాన్ని నడిపింది. సమయం దొరికినప్పుడల్లా ప్రియుడితో తిరుగుతూ తెగ ఎంజాయ్ చేసేది. కూతురి ప్రవర్తనను గమనించిన తల్లి.. చాలా సార్లు మందలించింది. అయినా ఆ బాలిక మాత్రం అస్సలు లెక్కచేయకుండా తల్లిపై కోపం పెంచుకుంది. అయితే, ఈ నెల 17న తల్లి బాత్రూమ్ లో జారిపడిపోయింది. దీంతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ బాలిక దారుణానికి ఒడిగట్టింది. తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయాలని భావించింది. అనుకున్నట్లుగానే ఈ నెల 18న తెల్లవారుజామున ప్రియుడిని ఇంటికి పిలిపించి తల్లి ముఖంపై దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది.
ఈ విషయం తెలుసుకున్న మృతురాలి కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కానీ, ఆమె అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని ఆ మహిళ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విచారణలో భాగంగా ముందుగా మృతురాలి కూతురిని ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పింది. పోలీసుల స్టైల్ లో విచారించే సరికి ఆ బాలిక ప్రియుడితో కలిసి నా తల్లిని నేనే హత్య చేశానని ఒప్పుకుంది. అనంతరం పోలీసులు ఆ బాలికతో పాటు ఆమె ప్రియుడిని సైతం అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలంగా మారుతోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş