P Venkatesh
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమవుతున్నారు వాహనదారులు. మితిమీరిన వేగాలతో వాహనాలను నడిపి అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. నేడు ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమవుతున్నారు వాహనదారులు. మితిమీరిన వేగాలతో వాహనాలను నడిపి అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. నేడు ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
P Venkatesh
దేశంలో నిత్యం ఎక్కడో ఓ దగ్గర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఊహించని ప్రమాదాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అప్పటి వరకు తమతో ఉన్న వారు తిరిగిరాని లోకాలకు చేరడంతో బాధితుల కుటుంబాల్లో తీవ్ర శోకం నెలకొంటుంది. ప్రమాదాల నివారణకు అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అరికట్టలేకపోతున్నారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి ప్రమాదాలకు కారణమవుతున్నారు వాహనదారులు. మితిమీరిన వేగాలతో వాహనాలను నడిపి అమాయకుల ప్రాణాలను తీస్తున్నారు. నేడు ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు పరిమితికి మించిన వేగంతో బీభత్సం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఢిల్లీ రోడ్డు ట్రాన్స్‌పోర్టు కార్పోరేషన్ కు చెందిన బస్సు సృష్టించిన బీభత్సం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృష్యాలు అక్కడున్న సీసీటీవీల్లో రికార్డయ్యాయి. కాగా ఢిల్లీలోని రోహిణి ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ అధిక స్పీడుతో నడపడంతో అదుపు తప్పి బస్సు ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా రోడ్డు పక్కన పార్క్ చేసిన టూ వీలర్ పైకి దూసుకెళ్లింది.
దీంతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. ఈ ఘోర ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ఇంతటి ఘోరానికి కారకుడైన బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
#WATCH | One person died after being hit by a DTC bus in Delhi’s Rohini area. Further investigation is underway: Delhi Police
(CCTV visuals confirmed by police) pic.twitter.com/Bt1ipo9GYr
— ANI (@ANI) November 4, 2023