iDreamPost
android-app
ios-app

Success Story: పేదరికం నుండి అక్కాచెల్లెళ్లు ఇద్దరూ IAS ఆఫీసర్స్ గా..! సక్సెస్ స్టోరీ..!

  • Published Feb 05, 2024 | 2:44 PM Updated Updated Feb 05, 2024 | 2:44 PM

మనం ఇప్పటివరకు ఎన్నో సక్సెస్ స్టోరీలను విని ఉంటాము. వాటిలానే ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ కూడా ఒకటి. కానీ, ఈ సక్సెస్ స్టోరీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్ళది. వీరి సాధించిన ఘనత గురించి తెలుసుకుందాం.

మనం ఇప్పటివరకు ఎన్నో సక్సెస్ స్టోరీలను విని ఉంటాము. వాటిలానే ఇప్పుడు చెప్పుకోబోయే స్టోరీ కూడా ఒకటి. కానీ, ఈ సక్సెస్ స్టోరీ ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్ళది. వీరి సాధించిన ఘనత గురించి తెలుసుకుందాం.

  • Published Feb 05, 2024 | 2:44 PMUpdated Feb 05, 2024 | 2:44 PM
Success Story: పేదరికం నుండి  అక్కాచెల్లెళ్లు ఇద్దరూ  IAS ఆఫీసర్స్ గా..! సక్సెస్ స్టోరీ..!

ఒక సక్సెస్ స్టోరీ తెలుసుకుంటున్నాం అంటే కేవలం వారు సాధించిన విజయాలను తెలుసుకోవడం మాత్రమే కాదు. వారి విజయం వెనుక వారు పడిన కష్టాన్ని అందరికి తెలియజేయడం ద్వారా.. అది ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని అర్ధం. చాలా మంది ఒక్కసారి ఏదైనా విషయంలో ఫెయిల్ అయిన తర్వాత .. వారి వలన కాదేమో అనే భయంతోనో.. రకరకాల సందేహాలతోనో వారి ప్రయత్నాన్ని ఆపేస్తారు. ప్రస్తుతం ఇలాంటి వారు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. కానీ, చాలా కొద్దీ మాత్రమే వారు అనుకున్న ఆశయాల వైపు అడుగులు వేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడే యువత.. నిరంతరం కష్టపడుతూనే ఉంటారు. ఈ క్రమంలో మన దేశంలో అంత్యంత కఠినమైన, ప్రతిష్టాత్మకమైన పరీక్ష యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC). ఈ పరీక్షను క్లియర్ చేసి .. ప్రభుత్వ రంగాలలో ఉద్యోగం సాధించాలనే యువత వేలల్లో ఉంటారు. వారిలో కొద్దీ మంది మాత్రమే పట్టుదలతో సాధించి అర్హులుగా నిలుస్తారు. ఈ క్రమంలో ఒకే ఏడాది సివిల్స్ సాధించిన అక్కచెల్లెళ్ళ గురించి ఇప్పడు తెలుసుకుందాం.

ప్రతి ఏడాది దేశంలో కొన్ని వేల మంది UPSC పరీక్షలకు సిద్ధం అవుతూ ఉంటారు. వారిలో కొద్దీ మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తూ ఉంటారు. అలానే ఇద్దరు అక్కచెల్లెలు 2020 వ సంవత్సరంలో ఒకేసారి ఈ పరీక్షను క్లియర్ చేసి.. వార్తల్లో నిలిచారు. వారే న్యూ ఢిల్లీకి చెందిన అంకితా జైన్, వైశాలి జైన్. వీరిద్దరూ కూడా మొదటి ప్రయత్నంలో ఈ పరీక్షను సాధించలేకపోయారు. అయినా కూడా పట్టు వదలని కార్యదీక్షతో నిరంతరం కష్టపడుతూ.. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అలా అంకితా జైన్ తన నాలుగవ ప్రయత్నంలో విజయాన్ని సాధించింది. ఆమె ప్రస్తుతం ముంబైలో ఇండియన్ ఆడిట్ మరియు అకౌంట్స్ సర్వీస్ ఆఫీసర్‌గా చేస్తోంది. అంతేకాకుండా.. ఆమె మహారాష్ట్రలో ఐపీఎస్ ఆఫీసర్ అభినవ్ త్యాగిని పెళ్లి చేసుకుంది. ఇక ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో.. బీటెక్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసింది వైశాలి జైన్. ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూనే .. అక్క బాటలో అడుగులు వేసింది వైశాలి. అలా బ్రతుకు తెరువు కోసం వేరే ఉద్యోగాలు చేస్తూ .. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా భావించింది వైశాలి జైన్.

అలా అక్క చెలెళ్ళు ఇద్దరూ.. ఒకే నోట్స్ చదువుతూ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు. వీరి పరీక్షల సమయంలో కూడా ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నారు. వారు పరీక్షల సమయానికి ముందు కోవిడ్ -19 బారిన పడ్డారు. దాంతో వారి కుటుంబం చాలా ఆందోళన చెందారు. అయినా కూడా వీరిద్దరూ దైర్యంగా ఉంటూ.. ఒకరికొకరు సహకరించుకుంటూ.. అనుకున్నది సాధించారు. అలా 2020 లో వారి లక్ష్యాన్ని ఛేదించారు. ఇద్దరిలో అంకితా జైన్ 3వ ర్యాంక్ తెచ్చుకోగా, వైశాలి జైన్ 21వ ర్యాంక్ ను సాధించారు. అలా ఒకే మెటీరియల్ లో ప్రిపేర్ అయ్యి.. ఒకేసారి.. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్షను క్లియర్ చేసిన సిస్టర్స్ గా వార్తల్లో నిలిచారు. ప్రస్తుతం వీరి సక్సెస్ స్టోరీ సామజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది. ఏదేమైనా ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవనున్నారు. మరి, ఈ సక్సెస్ స్టోరీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.