iDreamPost
android-app
ios-app

వీడియో: మృత్యువు సమీపంలో ఉన్నా.. కన్నబిడ్డలను రక్షణగా మారి తల్లి!

  • Published Dec 24, 2023 | 5:29 PM Updated Updated Dec 25, 2023 | 4:09 PM

ఇటీవల రైల్వే స్టేషన్లలొ ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోయాయి. రైల్వే సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా ఫ్లాట్ ఫామ్ వద్ద నిర్లక్ష్యంగా ఉండటం.. కదిలే రైలు ఎక్కడం లాంటివి చేయడం వల్ల అనుకోని ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఇటీవల రైల్వే స్టేషన్లలొ ప్రమాదాల సంఖ్య బాగా పెరిగిపోయాయి. రైల్వే సిబ్బంది ఎన్నిసార్లు చెప్పినా ఫ్లాట్ ఫామ్ వద్ద నిర్లక్ష్యంగా ఉండటం.. కదిలే రైలు ఎక్కడం లాంటివి చేయడం వల్ల అనుకోని ప్రమాదాలు జరుగుతున్నాయి.

వీడియో: మృత్యువు సమీపంలో ఉన్నా.. కన్నబిడ్డలను రక్షణగా మారి తల్లి!

అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే.. దేవుడు తనకు బదులుగా ఈ భూమిపై అమ్మను పంపించారని అంటారు పెద్దలు. నవమోసాలు ఎన్నో బాధలు భరించి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆ బాధలన్నీ మర్చిపోతుంది. తన బిడ్డలకు ఏ చిన్న ప్రమాదం జరిగినా తన కంట నీరు వస్తుంది. పుట్టినప్పటి నుంచి కంటికి రెప్పలా కాపాడుతుంది. ఓ తల్లి తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా కన్న పిల్లలను రక్షించుకునేందు చేసిన సాహసానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

బీహార్‌లోని బార్హ్ రైల్వే స్టేషన్‌లో న్యూఢిల్లీకి వెళ్లే విక్రమశిల ఎక్స్‌ప్రెస్ ఒక మహిళతో పాటుగా ఇద్దరు పిల్లలపై దూసుకు వెళ్లింది. అదృష్టం కొద్ది తల్లీపిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన శనివారం చోటు చేసుకుంది. బార్హ్ రైల్వే స్టేషన్ లో విక్రమశిలా ఎక్స్ ప్రెస్ కోసం తల్లి తన ఇద్దరు పిల్లలతో వెయిట్ చేస్తుంది. అంతలోనే రైలు స్టేషన్ కు చేరుకోవడంతో జనాలు రైలు ఎక్కే ప్రయత్నంలో తల్లీ బిడ్డలు ప్రమాద వశాత్తు పట్టాలపై పడిపోయింది. అది ఎవరూ గమనించలేదు.. రైలు కదలడం ప్రారంభించింది.

తల్లి తన ప్రాణాలు పోవడం ఖాయం అనుకుంది. అంగుళం దూరంలో మృత్యువు పొంచి ఉన్నా.. తన పిల్లలను రక్షించాలన్న ఉద్దేశంతో వారిని దగ్గరకు లాక్కొని రైలు వెళ్లిపోయేంత వరకు కదలకుండా ఉంది. రైలు ఆమె తలకు దగ్గరగా వెళిపోయింది. అనంతరం అక్కడు ఉన్నవాళ్లంతా తల్లీబిడ్డలను పైకి లేపారు. స్థానిక ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నెటిజన్లు తల్లి సాహసాన్ని ప్రశంసిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.