Krishna Kowshik
విక్టరీ వెంకటేశ్, మీనా కాంబోలో వచ్చిన హిట్ మూవీ దృశ్యం. ఇటీవల ఈ సినిమా తరహా ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా మరోటి పునరావృతమైంది. ఓ ఇల్లాలు.. ప్రియుడి కోసం
విక్టరీ వెంకటేశ్, మీనా కాంబోలో వచ్చిన హిట్ మూవీ దృశ్యం. ఇటీవల ఈ సినిమా తరహా ఘటనలు వెలుగు చూశాయి. తాజాగా మరోటి పునరావృతమైంది. ఓ ఇల్లాలు.. ప్రియుడి కోసం
Krishna Kowshik
సినిమాల ప్రభావం.. జనాల మీద పడుతుందో.. లేక నిజ జీవితంలో జరుగుతున్న ఘటనలే సినిమాలాగా తెరకెక్కిస్తున్నారో తెలియదు కానీ.. కొన్ని క్రైమ్ సంఘటనలు చూస్తుంటే పోలీసులు సైతం నివ్వెర పోయాలా చేస్తున్నాయి. తాజాగా ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఓ సంఘటన చూస్తే.. అరే అచ్చు ఆ సినిమాలా ఉందే అనిపించకమానదు. తెలుగులో వెంకీ, మీనా హీరో హీరోయిన్లుగా నటించిన దృశ్యం ఎంత పెద్ద హిట్ కొట్టిందో తెలుసు. ఇది మలయాళ మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఎన్ని భాషల్లో తీస్తే అన్ని చోట్ల హిట్ టాక్ తెచ్చుకుంది కథ. ఇప్పుడు ఇదే తరహాలో ఓ హత్య చోటుచేసుకుంది. గత ఏడాది డిసెంబర్‌లో వ్యక్తి చనిపోతే.. తాజాగా పోలీసులు ఈ కేసును చేధించడంతో వెలుగులోకి వచ్చింది. ప్రియుడి మోజులో పడి ఓ ఇల్లాలు.. భర్తను కడతేర్చి.. అతడి సాయంతో ఓ నిర్మాణంలో ఉన్న బంగ్లాలో పూడ్చిపెట్టింది.
ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని మహాసముంద్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బిర్కోనిలో నివాసముంటున్నారు భార్యా భర్తలు దేవిక చంద్రకర్, యుపేష్ చంద్రకర్. దేవిక.. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఆమెకు జ్యోతిష్యుడైన ముకుంద్ త్రిపాఠితో పరిచయం, ప్రేమకు దారి తీసింది. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం భర్తకు తెలిసింది. గత ఏడాది డిసెంబర్ 8న మద్యం సేవించి వచ్చిన భర్త.. ఈ విషయంపై గొడవపడ్డాడు. ఈ గొడవలో భర్త తలపై దాడి చేయడంతో అతడు నేలపై పడిపోయాడు. వెంటనే ప్రేమికుడికి, తన తల్లిదండ్రులకు విషయం చెప్పింది. దీంతో వీరంతా కలిసి ఓ పథకం రచించారు. అపస్మారక స్థితిలో ఉన్న యుపేష్ చంద్రకర్‌ను ప్రియుడు ముకుంద్ తన ఇంటికి తీసుకెళ్లాడు.
అక్కడ అతడిని గొంతు నులిమి హత్య చేసి, దుకాణంలో నైలాన్ తాడు కొని మృతదేహాన్ని కట్టి పాలిథిన్‌లో ప్యాక్ చేశాడు. రెండు రోజుల తర్వాత డిసెంబర్ 10న రిక్షాలో ఆ మృతదేహాన్ని తన కార్యాలయానికి తీసుకెళ్లాడు ముకుంద్. ఆ భవనం పక్కనే మరో భవనం నిర్మాణం జరుగుతోంది. అదే రోజు రాత్రి దేవికకు ఫోన్ చేసి అక్కడకు రావాలని పిలిచాడు. ఇద్దరు కలిసి 4 నుంచి 5 అడుగుల గొయ్యి తవ్వి మృతదేహాన్ని అందులో పూడ్చిపెట్టారు. మరుసటి రోజు డిసెంబర్ 11న శవం కంపు కొట్టకుండా ఉండేందుకు గోతి తీసి..ఉప్పు వేసి కప్పేశారు. ఆ తర్వాత భర్త కనబడటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది దేవిక. మిస్సింగ్ రిపోర్టు దాఖలు చేసినా ఫాలో అప్ చేయకపోవడంతో పోలీసుల అనుమానం వచ్చింది. విచారించగా అసలు విషయాలు వెలుగు చూశాయి. దేవిక చంద్రకర్, ముకుంద్ త్రిపాఠి ఇద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. కాగా, ఇందులో ఆమె అమ్మా నాన్నల హస్తం ఉండటంతో.. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు.