iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో యువతి కోసం గ్యాంగ్ వార్.. యువకుడు మృతి..

  • Published Mar 09, 2024 | 10:06 PM Updated Updated Mar 09, 2024 | 10:07 PM

హైదరాబాద్ లో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. ఓ యువకుడు తన చెల్లి గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఘర్షనకు దారితీసింది. ఆ తర్వాత దాడులకు పాల్పడడంతో ఘోరం జరిగిపోయింది.

హైదరాబాద్ లో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. ఓ యువకుడు తన చెల్లి గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఘర్షనకు దారితీసింది. ఆ తర్వాత దాడులకు పాల్పడడంతో ఘోరం జరిగిపోయింది.

  • Published Mar 09, 2024 | 10:06 PMUpdated Mar 09, 2024 | 10:07 PM
హైదరాబాద్‌లో యువతి కోసం గ్యాంగ్ వార్.. యువకుడు మృతి..

ప్రేమ చావడానికైనా చంపడానికైనా దారితీస్తోంది. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని దాడులకు పాల్పడడం చివరికి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. ప్రియుడు మోసం చేసినా కూడా ఇదే విధమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేమ మాటున ఘోరాలు జరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లో యువతి విషయంలో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. తన చెల్లి గురించి అసభ్యంగా మాట్లాడడంతో యువతి సోదరుడు, అతని స్నేహితులు ఓ యువకుడిపై భౌతిక దాడి చేయడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన టోలిచౌకిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

టోలిచౌకిలో నివాసముంటున్న విశాల్ సింగ్ కొంత కాలం క్రితం మణికొండలో ఉండే యువతిని ప్రేమ పేరుతో వేధించాడు. తనను ప్రేమించాలంటూ వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో విషాల్ సింగ్ కు వార్నింగ్ ఇచ్చారు. అమ్మాయి వెంట పడకూడదని హెచ్చరించారు. ఆ తర్వాత నిన్న(శుక్రవారం) రాత్రి విశాల్ సింగ్ కు యువతి సోదరుడు శ్యామ్ ఫోన్ చేసి మణికొండకు రప్పించాడు. అక్కడికి వచ్చిన విశాల్ సింగ్ తో కలిసి శ్యామ్ అతని స్నేహితులు భయ్యా, అర్జున్, సుమన్, రాజేష్, సోని, అరుణ్ లు మద్యం సేవించారు.

మద్యం మత్తులో శ్యామ్ సోదరి విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సమయంలో విశాల్ సింగ్ ఆ యువతి గురించి అసభ్యంగా మాట్లాడడంతో ఘర్షన తలెత్తింది. శ్యామ్ అతని స్నేహితులు విశాల్ సింగ్ మీద కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన విశాల్ ను రాయదుర్గం పోలీసులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కానీ విశాల్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు శ్యామ్, అతని స్నేహితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş