P Venkatesh
తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో స్వల్ప గాయాలపాలయ్యారు.
తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘోర రోడ్డు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో స్వల్ప గాయాలపాలయ్యారు.
P Venkatesh
ఇటీవల రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వల్ల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనదారులు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. తాజాగా ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు పెను ప్రమాదం తప్పింది. అతను ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో తెలంగాణకు చెందిన ధర్మపురి ఎమ్మెల్యే గాయాలపాలయ్యారు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. జగిత్యాల జిల్లా ఎండవల్లి మండలం అంబారిపేట దగ్గర ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జుకాగా ఎమ్మెల్యే స్వల్పగాయాలతో బయటపడ్డారు. ఆయనతో పాటు కారులో ప్రయాణిస్తున్న ఆయన అనుచరులకు కూడా గాయాలయ్యాయి.
ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో అదుపు తప్పి అడ్లూరి వాహనం బోల్తాపడినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో సహా.. గాయాలైన వారందరినీ కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యే కారుకు ప్రమాదం జరిగిందన్న సమాచారం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. ఎమ్మెల్యేను పరామర్శించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఆసుపత్రికి తరలివస్తున్నారు.
Breaking News
ధర్మపురి ఎమ్మేల్యే కారు బోల్తా
ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ప్రమాదం తప్పింది.
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద లారీని తప్పించబోయి ఎమ్మల్యే కారు బోల్తా ఘటనలో కారులోనే ఉన్న ఎమ్మేల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మరియు అతని… pic.twitter.com/GuXXEtJMbx
— Telugu Scribe (@TeluguScribe) February 19, 2024