iDreamPost
android-app
ios-app

ఆలయంలో రెచ్చిపోయిన భక్తులు! గుడిలో ఇవేం పనులంటూ నెటిజన్స్ ఫైర్!

ఆలయంలో రెచ్చిపోయిన భక్తులు! గుడిలో ఇవేం పనులంటూ నెటిజన్స్ ఫైర్!

ప్రముఖ శైవక్షేత్రం అయిన మహానందిని దర్శించుకోవడానికి రోజుకు ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఎప్పటి లాగే తాజాగా కూడా చాలా మంది భక్తులు ఆ దేవుడి దర్శనం కోసం వచ్చారు. కానీ.., ఉన్నట్టుండి భక్తులు, ఆలయ సిబ్బంది గుడిలో పిచ్చి పనులకు తెర లేపారు. దీన్ని గమనించిన మరి కొందరు భక్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని స్టేషన్ కు తరలించి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియలో కాస్త వైరల్ గా మారుతున్నాయి. ఇంతకు ఈ ఆలయంలో భక్తుల, ఆలయ సిబ్బంది ఏం చేశారు? అసలేం జరిగిందంటే?

ఏపీలోని ప్రముఖ శైవక్షేత్రం అయిన మహానందిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలి వస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా కూడా ఈ గుడికి భక్తుల తాకిడి మరింత పెరిగింది. అయితే సాయంత్రం 5:30 నుంచి 6:30 మధ్యలో ఆ దేవుడికి అష్టాదశ మహామంగళ హారతులు ఇస్తారు. దీంతో ఆలయ సిబ్బంది దర్శనాన్ని ఆపేస్తారు. ఒకవేళ ఆ సమయంలో దర్శనానికి వెళ్లాలంటే మాత్రం ఖచ్చితంగా రూ.150 రుసుం చెల్లించి దర్శించుకోవాలి. ఇదే విషయంపై కొందరు భక్తులు ఆలయ సిబ్బందితో గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల దాడి కూడా చేసుకున్నారు.

ఇక కట్టలు తెగే కోపం రావడంతో దాడి కూడా చేసుకున్నారు. ఇదంతా గమనించిన మరి కొందరు భక్తులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, తగ్గేదేలే అన్నట్లుగా అస్సలు వినలేదు. దీంతో పోలీసులు వారిని నేరుగా స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్స్ లింగ్ ఇచ్చి తిరిగి పంపించినట్లుగా తెలుస్తోంది. కాగా, గుడిలో వీళ్లు దాడి చేసుకున్న దృశ్యాలను కొందరు సెల్ ఫోన్ లో వీడియోలు, ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీటిని చూసిన కొందరు నెటిజన్స్.. గుడిలో ఇవేం పనులు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.