Arjun Suravaram
Darshan Case: తన అభిమాని రేణుకాస్వామి హత్యలో అరెస్టైన దర్శన్, పవిత్రా గౌడలు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు పోలీసులకు దర్శన్ భార్య విజయ లక్ష్మీ ఓ లేఖ రాశారు.
Darshan Case: తన అభిమాని రేణుకాస్వామి హత్యలో అరెస్టైన దర్శన్, పవిత్రా గౌడలు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బెంగళూరు పోలీసులకు దర్శన్ భార్య విజయ లక్ష్మీ ఓ లేఖ రాశారు.
Arjun Suravaram
ప్రముఖ కన్నడ హీరో, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కేసు దేశ వ్యాప్తంగా సంచలన సృష్టించిన సంగతి తెలిసింది. ఇలా ఓ స్టార్ హీరో హత్య కేసులో చిక్కుకోవడం, అంతేకాక ఈ స్థాయిలో దేశ వ్యాప్తంగా సంచలనం కావడం సినీ చరిత్రలోనే ప్రథమం. తన అభిమాని రేణుకా స్వామిని హత్యచేసిన కేసులో దర్శన్ అరెస్టు అయ్యాడు. ఆయనతో పాటు ప్రియురాలు పవిత్రాగౌడ కూడా ప్రస్తుతం పోలీసుల కస్టడీలో ఉంది. ఈ కేసులో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పోలీసుల విచారణలో దర్శన్ , పవిత్రలను దంపతులుగా పేర్కొన్నారు. ఈ అంశంపై దర్శన్ భార్య విజయ లక్ష్మీ అభ్యంతరం వ్యక్తం చేశారు. పవిత్ర తన భర్తకు భార్య కాదంటూ బెంగళూరు పోలీసు కమిషనర్ బి.దయానందకు తాజాగా లేఖ రాశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే…
తన అభిమాని రేణుకాస్వామి హత్యలో అరెస్టైన దర్శన్, పవిత్రా గౌడలు ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్నారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసు విచారణ క్రమంలో పోలీసులు వీరిద్దరినీ దంపతులుగా పేర్కొనడంపై దర్శన్ భార్య విజయలక్ష్మి అభ్యంతరం వ్యక్తంచేశారు. బెంగళూరు పోలీసులకు ఆమె తాజాగా లేఖ రాశారు. ఆ లేఖలో ఆమె కీలక అంశాలను ప్రస్తావించింది. ఇటీవల మీడియా సమావేశంలో పవిత్రను దర్శన్ భార్య అంటూ పోలీసులు తప్పుగా ప్రకటన చేశారని, ఆ తర్వాత కర్ణాటక హోంమంత్రి కూడా ఇదే మాట అన్నారని ఆమె లేఖలో పేర్కొన్నారు.
ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ నటుడి దంపతులు అరెస్టయ్యారని ఆ హోమంత్రి తెలిపారని, పవిత్ర దర్శన్ భార్య కాదని విజయలక్ష్మి తెలిపింది. కేవలం తన భర్తకు స్నేహితురాలు మాత్రమేనని, దర్శన్‌కు చట్టపరమైన జీవిత భాగస్వామిని తాను ఒక్కదాన్ని అని తెలిపింది. 2003లో తమ పెళ్లి జరిగిందని, పోలీసు రికార్డుల్లోనూ ఆమె పేరును దర్శన్ భార్యగా పేర్కొనవద్దని విజ్ఞప్తి చేసింది. అది భవిష్యత్తులో తనకు, తన కుమారుడికి సమస్యలు తెచ్చిపెడుతుందని ఆవేదన వ్యక్తం చేసింది. పవిత్రకు సంజయ్‌సింగ్ అనే వ్యక్తితో వివాహమైందని, వారికి ఓ కుమార్తె కూడా ఉందని, దయచేసి ఈ వాస్తవాలను రికార్డుల్లో స్పష్టంగా రాయండని విజయలక్ష్మి తన లేఖలో పోలీసులను అభ్యర్థించింది.
ఇక దర్శన్ విషయానికి వస్తే.. విజయలక్ష్మితో వివాహం జరిగింది. ఓ సారి సినిమా షూటింగ్ సమయంలో కన్నడ నటి పవిత్రతో స్నేహం ఏర్పడి, అది ప్రేమకు దారి తీసికింది. ఈ క్రమంలోనే తమ బంధానికి పదేళ్లు అంటూ గతంలో ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పవిత్ర కారణంగానే విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందని దర్శన్ అభిమాని రేణుకాస్వామి.. అసభ్య హెచ్చరికలు చేశాడని పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసిందని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. ఇక ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు మరో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరంతా కస్టడీలో ఉన్నారు.