iDreamPost

మార్కెట్ లో కొత్త మోసం.. ఇలాంటి ఫోన్లు, మెసేజ్లు వచ్చినప్పుడు ఇలా చేయండి..!

What Is This Parcel Scam: మార్కెట్లోకి మరో కొత్త మోసం వచ్చేసింది. ఒక్క ఫోన్ కాల్ చేసి మీ ఖాతాను ఖాళీ చేసే బ్యాచ్ తయారైంది. వీళ్లతో గనుక మాట కలిపితే మీ బ్యాంకు అకౌంట్లను దెబ్బకు ఖాళీ చేసేస్తారు.

What Is This Parcel Scam: మార్కెట్లోకి మరో కొత్త మోసం వచ్చేసింది. ఒక్క ఫోన్ కాల్ చేసి మీ ఖాతాను ఖాళీ చేసే బ్యాచ్ తయారైంది. వీళ్లతో గనుక మాట కలిపితే మీ బ్యాంకు అకౌంట్లను దెబ్బకు ఖాళీ చేసేస్తారు.

మార్కెట్ లో కొత్త మోసం.. ఇలాంటి ఫోన్లు, మెసేజ్లు వచ్చినప్పుడు ఇలా చేయండి..!

మార్కెట్లో ఇప్పటివరకు చాలానే మోసాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా ఒళ్లు వంచకుండా ఎవరో కష్టార్జితాన్ని దోచుకోవాలి అని చూసే వారి సంఖ్య ఎక్కువైపోయింది. అలాంటి వారి కృషి వల్లే ఇప్పుడు మార్కెట్లోకి కొత్తరకం మోసం వచ్చింది. ప్రస్తుతం అందరినీ ఈ ఘరానా మోసం లక్షలు నష్టపోయేలా చేస్తోంది. ఇది కేవలం ఫ్రాడ్ అని తెలియక ఎంతో మంది తాము కష్టపడి సంపాదించుకున్న కష్టార్జితాన్ని కోల్పోతున్నారు. అసలు ఆ మోసం ఏంటి? ఎందుకు ప్రజలు అంత తేలిగ్గా నమ్మేస్తున్నారు? అసలు ఆ మోసాన్ని ఎలా తిప్పి కొట్టాలి అనే ఇంట్రస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న మోసం పేరు పార్సిల్ స్కామ్ లేదా కొరియర్ స్కామ్ అంటారు. అంటే మీ పేరిట ఒక పార్సిల్ వచ్చింది అంటారు. అయితే అందులో మాదకద్రవ్యాలు, నిషేదిత వస్తువులు ఉన్నాయి అంటూ కబుర్లు చెప్తారు. కాసేపు మిమ్మల్ని బెదిరిస్తారు. మీ మీద కేసు నమోదు చేస్తున్నాం అంటూ మాయ మాటాలు చెప్తారు. కాసేపు మిమ్మల్ని బెదిరించి.. డబ్బులకు బేరానికి వస్తారు. మీరు గనుక ఫలానా మొత్తం ఇచ్చేస్తే మీ మీద ఎలాంటి కేసు లేకుండా చూస్తాం అంటూ నమ్మబలుకుతారు. అందుకు వాళ్లు అడిగినంత కట్టాలి. లేదంటే మీ దగ్గర ఉన్నదంతా ఊడ్చేసి ఇవ్వాలి. రెండు సందర్భాల్లోనూ మీ ఖాతాను ఖాళీ చేయడమే వారి ధ్యేయం.

ఎలా స్టార్ట్ చేస్తారు?:

ఈ స్కామ్ మొదట ఒక మిస్డ్ కాల్ తో స్టార్ట్ అవుతుంది. మీరు తిరిగి ఆ నంబర్ కు కాల్ చేస్తే ఏదో ఒక కొరియర్ ఆఫీస్ కి వెళ్లినట్లు ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఎవరో ఒక అధికారి మాట్లాడుతున్నాం అని చెప్తారు. అది పోలీసు అధికారులు, ఎన్సీఆర్బీ ఏజెంట్లు, కస్టమ్ అధికారుల పేర్లతో పరిచయం చేసుకుంటారు. మీ పేరిట ఒక పార్సిల్ వచ్చింది అంటారు. ఆ తర్వాత అందులో నిషేదిత మాదకద్రవ్యాలు ఉన్నట్లు మీకు చెప్తారు. ఆ తర్వాత బెదిరింపులకు దిగుతారు. మీ మీద కేసు నమోదు చేయబోతున్నాం అంటూ బెదిరిస్తారు. ఆ తర్వాత మీ ఆధార్ నంబర్, బ్యాంకు వివరాలు, పాన్ కార్డు డీటెయిల్స్ కలెక్ట్ చేస్తారు. ఆ వివరాల ద్వారా మీ బ్యాంకు ఖాతాను ఖాళీ చేస్తారు.

ఈ తరహా మోసాలపై అవగాహనతో ఉండాలని పోలీసులు, సైబర్ క్రైమ్ టీమ్ హెచ్చరిస్తోంది. ఈ మోసాలను అరి కట్టేందుకు కృషి చేస్తున్న విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులు, కేంద్ర టెలిఫోన్ అథారిటీ రంగం రంగంలోకి దిగింది. ఈ మోసాలను అరికట్టే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ మోసాలకు సంబంధించి ఇప్పటికే ఫేక్ ఐడీలను గుర్తించినట్లు చెప్పారు. దాదాపు 1500 వరకు ఫేక్ సోషల్ మీడియా ఐడీలను గుర్తించామన్నారు. ఈ తరహా ఫోన్లు, మెయిల్స్ వస్తే మాత్రం సంబధింత అధికారులు, పోలీసులు దృష్టికి తీసుకెళ్లండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి