iDreamPost
android-app
ios-app

బంగారం లాంటి భార్య ఉన్నా.. మరదలిపై కన్నేసి నీచం!

  • Published Jan 09, 2024 | 5:37 PM Updated Updated Jan 09, 2024 | 5:37 PM

అందమైన భార్య ఉన్నా కూడా కొంత మంది పరాయి స్త్రీల పట్ల ఆకర్షితులవుతుంటారు. ఆమె సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ ఉంటారు. భార్యకు తెలియనంత వరకు చాటుమాటు వ్యవహారాన్ని నడుపుతుంటాడు భర్త. కానీ ఆమెకు తెలిస్తే..

అందమైన భార్య ఉన్నా కూడా కొంత మంది పరాయి స్త్రీల పట్ల ఆకర్షితులవుతుంటారు. ఆమె సాన్నిహిత్యాన్ని కోరుకుంటూ ఉంటారు. భార్యకు తెలియనంత వరకు చాటుమాటు వ్యవహారాన్ని నడుపుతుంటాడు భర్త. కానీ ఆమెకు తెలిస్తే..

  • Published Jan 09, 2024 | 5:37 PMUpdated Jan 09, 2024 | 5:37 PM
బంగారం లాంటి భార్య ఉన్నా.. మరదలిపై కన్నేసి నీచం!

భార్యను కాదని మరదలి మోజులో పడ్డాడు కట్టుకున్నవాడు. భార్యా పిల్లల్ని పట్టించుకోకుండా.. ఇక ఆమె జ్ఞాపకాల్లో మునిగి తేలుతున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని గట్టిగా భావించాడు. మరదలిని పెళ్లి చేసుకోవాలంటే అడ్డుగా నిలిచింది భార్య. అయినా సరే మరదలిని ఎలాగైనా దక్కించుకోవాలని అనుకున్నాడు.ఈ విషయం భార్యకు తెలిసింది. మరదలితో వివాహానికి భార్య నో చెప్పింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న భర్త ఆమె అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడు. అందు కోసం మాస్టర్ ప్లాన్ గీశాడు. ఆ తర్వాత డ్రామా అప్లై చేశాడు. కానీ రంగంలోకి దిగిన పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు నిజాలు కక్కాడు.

మరదల్ని పెళ్లి చేసుకునేందుకు అందమైన భార్యను, కడుపున పుట్టిన బిడ్డను అత్యంత కిరాతకంగా చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యుపిలోని లతిత్ పూర్‌లో సదర్ కొత్వాలి ప్రాంతంలోని చంద్ మారి గ్రామంలో నివసిస్తోంది నీరజ్ కుష్వాహ కుటుంబం. నీరజ్ మరదలిపై మోజు పడ్డాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. అందుకు ససేమీరా అని చెప్పింది భార్య.ఈ క్రమంలో ఓ రోజు అతడి భార్య, పాప రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు.  నీరజ్ కూడా గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. ఏమైందని పోలీసులు ప్రశ్నించగా.. కొంత మంది ఆగంతకులు అర్థరాత్రి 1.30 గంటలకు ముసుగులు ధరించి.. ఇంట్లోకి చొరబడి, భార్య, కుమార్తెపై దాడి చేసి హత్య చేశారని, తనపై కూడా దాడి చేసి తన నోట్లో సాక్సులు కుక్కి.. నగలు దోచుకుని పారిపోయారని చెప్పారు. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా హల్ చల్ చేసింది.

అయితే అతడు చెబుతున్న కహానీలో ఏదో తత్తరపాటు దొర్లింది. అనుమానం వచ్చిన పోలీసులు గట్టిగా నిలదీసే సరికి అసలు విషయం కక్కాడు. ఆ ఇద్దర్ని తానే చంపేసినట్లు వెల్లడించాడు. ‘నా భార్య అందంగా ఉంటుంది, ఆమెకు సోషల్ మీడియా పిచ్చి, రీల్స్ అంటూ కాలక్షేపం చేసేది, వారితోనే ఎక్కువగా మాట్లాడేది’ అని చెప్పాడు. అది తనకు నచ్చలేదని, భార్యను వదిలించుకుని మరదల్ని వివాహం చేసుకోవాలని అనుకున్నాను. ఈ విషయం భార్యకు తెలిసి గగ్గోలు పెట్టింది. దీంతో ఆమె అడ్డు తొలగించుకునేందుకు క్రికెట్ బ్యాట్ భార్య, బిడ్డను చంపి.. నాటకం ఆడానని చెప్పుకొచ్చాడు. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు దొంగతనం జరిగినట్లుగా వస్తువులన్నీ చెల్లాచెదురు చేసి.. ఆభరణాలను టీవీ వెనుక పెట్టినట్లు చెప్పారు. మరదలిపై మోజు పడి.. కట్టుకున్నదాని కడతేర్చిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను  కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet