iDreamPost
android-app
ios-app

భార్యపై కన్నేసిన పక్కింటి అబ్బాయి.. భర్తకు తెలిసి

భార్యా భర్తల మధ్య కలహాలు ఉన్నప్పటికీ.. ఇద్దరిలో ఎవరికి సమస్య వచ్చినా.. వారికి మద్దతుగా నిలుస్తుంటారు. ముఖ్యంగా భార్యకు ఎవరి నుండైనా ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే సహించలేడు. నయాన్నో, భయాన్నో మందలిస్తుంటాడు. హద్దులు దాటితే..

భార్యా భర్తల మధ్య కలహాలు ఉన్నప్పటికీ.. ఇద్దరిలో ఎవరికి సమస్య వచ్చినా.. వారికి మద్దతుగా నిలుస్తుంటారు. ముఖ్యంగా భార్యకు ఎవరి నుండైనా ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే సహించలేడు. నయాన్నో, భయాన్నో మందలిస్తుంటాడు. హద్దులు దాటితే..

భార్యపై కన్నేసిన పక్కింటి అబ్బాయి.. భర్తకు తెలిసి

భార్యా భర్తల మధ్య ఎన్ని గొడవలు రానీ.. వారి మధ్యలోకి మూడవ వ్యక్తిని ఎంటర్ చేసేందుకు ఇష్టపడరు దంపతులు. తమలో తాము తన్నుకుంటూనే.. ఆతర్వాత కాంప్రమైజ్ అవుతుంటారు. బయట వ్యక్తులు వీరి మధ్యలోకి వచ్చి సలహాలు ఇస్తే సహించలేరు. అలాగే భర్తను ఒక మాట అన్నా, భార్యను ఎవరైనా ఏదన్నా అంటే భరించలేరు దంపతులు. అది ఎవరైనా సరే. భార్యను బాగా ప్రేమించే భర్త  అయితే.. వారికి చిన్న ఆపద వచ్చినా తట్టుకోలేరు. ఎంత దూరమైనా వెళతారు. అందుకు ఈ ఘటనే ఓ ఉదాహరణ. భార్యపై పక్కింటి అబ్బాయి కన్నేశాడు. ఆమెను వెకిలి చేష్టలతో హింసకు గురి చేశాడు. ఈ విషయం భర్తకు చెప్పింది భార్య. కోపంతో ఊగిపోయిన భర్త.. అవకాశం కోసం ఎదురు చూసి.. అతడిపై రంపంతో దాడి చేశాడు.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యుపిలోని జవహర్ నగర్‌లోని ముత్తు స్వామి కాలనీలో బంధువు తులసీరాం ఇంట్లో అద్దెకు ఉంటున్నారు ఓంకార్ విశ్వకర్మ, శ్వేత. విశ్వకర్మ కార్పెంటర్‌గా పని చేస్తున్నాడు. అయితే తులసీరాం కుమారుడు తనూ శ్వేత పట్ల గుచ్చి గుచ్చి చూడటమే కాకుండా.. వెకిలీ చేష్టలతో ఇబ్బందికి గురి చేస్తున్నాడు. ఆమెను తన చేష్టలతో మానసికంగా వేధించాడు. అయితే తొలుత బంధువు అని సహించింది శ్వేత. రానూ రానూ అతడి ఆగడాలు మితి మీరిపోయాయి. శ్వేత పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తుండటంతో తట్టుకోలేక భర్తకు విషయం చెప్పింది. కోపంతో రగిలిపోయిన ఓంకార్.. అదును కోసం వేచి చూశాడు.

మంగళవారం రాత్రి తనూ ఒంటరిగా దొరకడంతో అతడిపై దాడి చేశారు భార్యా భర్తలు. రంపంతో తనూపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కేకలు వేయడంతో చుట్టూ ప్రక్కల వాళ్లు రాగా, రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు తనూ.  ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందగా.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తనూను ఆసుపత్రికి తరలించారు. కాగా, తనూ తండ్రి తులసీరాం ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్యా భర్తలు ఓంకార్, శ్వేతలను అదుపులోకి తీసుకున్నారు. తన కుమారుడ్ని హత్య చేసేందుకు వీరిద్దరూ ప్రయత్నించారంటూ కంప్లైట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. వారిని విచారిస్తున్నారు.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişbahis siteleri