iDreamPost
android-app
ios-app

టీ ఇచ్చేందుకు 10 నిమిషాలు పడుతుందన్న భార్యపై భర్త దారుణం!

భార్యా భర్తల మధ్య గిల్లికజ్జాలు అవసరమే కానీ.. కొన్ని హద్దు దాటేస్తున్నాయి. దంపతుల మధ్య గొడవలు పడేందుకు సరైన కారణాలు ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లలు ముందు కొట్టుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి..

భార్యా భర్తల మధ్య గిల్లికజ్జాలు అవసరమే కానీ.. కొన్ని హద్దు దాటేస్తున్నాయి. దంపతుల మధ్య గొడవలు పడేందుకు సరైన కారణాలు ఉండటం లేదు. చిన్న చిన్న విషయాలకు కూడా పిల్లలు ముందు కొట్టుకుంటారు. తాజాగా ఓ వ్యక్తి..

టీ ఇచ్చేందుకు 10 నిమిషాలు పడుతుందన్న భార్యపై భర్త దారుణం!

భార్యా భర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుంటాయి. మాట మాట పెరిగి కొట్టుకునే స్థాయికి చేరుకుంటుంటాయి. ముఖ్యంగా వంట విషయంలో వివాదం నెలకొంటుంది. ఫుడ్ విషయంలో కొంత మంది భర్తలు ఎక్కువగా వంకలు పెడుతుంటారు. కూరల్లో ఉప్పు సరిగా వేయలేదని, కారం తగ్గిందని, అన్నం మొత్తగా ఉడికిందని, ఉడకలేదని భార్యతో గొడవకు దిగుతుంటాడు భర్త. తాళింపు మాడినా, కరివేపాకు వేయకపోయినా ఇక అంతే సంగతులు. కూర బాగోకపోతే..కంచం నేలమీద విసిరేసి.. శుచి, శుభ్రం లేకపోయినా, బయట డబ్బులు పెట్టి మరీ తింటుంటారు. ఇదేమీ విచిత్రమో. టీ ఇవ్వమని భర్త అడిగితే.. 10 నిమిషాలు టైం పడుతుందని చెప్పినందుకు భార్యను అత్యంత కిరాతకంగా చంపేశాడో భర్త.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. 52 ఏళ్ల భర్త ధరమ్ వీర్, సుందరి భార్యా భర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. అతడు రోజు వారీ కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషిస్తుంటాడు. మంగళవారం ఉదయం నిద్ర లేచిన ధరమ్ వీర్.. తన భార్యను టీ ఇవ్వాలని కోరాడు. ఐదు నిమిషాల తర్వాత వంటగదిలోకి వెళ్లి మళ్లీ టీ అడిగాడు. సుందరి ఒక పది నిమిషాలు ఆగమని కోరింది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త.. కత్తి తీసుకువచ్చి భార్యను వెనుక నుండి పొడిచాడు. దీంతో ఆమె కేకలు వేసింది. మరో గదిలో నిద్రిస్తున్న పిల్లలు ఈ అరుపులు విని పరుగెత్తుకు వెళ్లేసరికి సుందరి తీవ్ర రక్తస్రావంతో పడి ఉండటం చూసి షాక్ అయ్యారు.

కోపంతో ఉన్న ధరమ్ వీర్.. అదే కత్తితో పిల్లలపైకి కూడా రావడంతో.. వారు భయపడి గదిలోకి వెళ్లి దాక్కున్నారు. అయితే తీవ్ర రక్త స్రావంతోనే తల్లి సుందరి కన్నుమూసింది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ధరమ్ ఇంటికి చేరుకుని అతడ్ని అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.. విచారణ చేపట్టారు. భర్త ధరమ్‌కు టీ అలవాటు బాగా ఉందని, రోజుకు 6 కప్పులకు పైగా తేనీరు తాగుతాడని పిల్లలు వెల్లడించారు. కేవలం కప్ టీ కోసం భార్యను భర్త చంపేసిన ఇలాంటి సంఘటనలు చూస్తుంటే.. ఆందోళన కలుగుతుంది. మరీ మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişMadridbetMadridbetmeritbetmeritbetzirvebetPradabet güncel girişjojobetgalabetHoliganbetJojobet Girişjojobetjojobetjojobetcasibompokerklas giriş