Krishna Kowshik
ఇటీవల చిన్న చిన్న కారణాలతో యువత మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఓపిక తక్కువ, వెంటనే అన్ని తమ కాళ్ల దగ్గరకు వచ్చేయాలన్న మనస్థత్వాలతో ఉంటున్నారు. దీని కారణంగా ఓటమిని తీసుకోలేకపోతున్నారు.
ఇటీవల చిన్న చిన్న కారణాలతో యువత మానసిక స్థైర్యాన్ని కోల్పోతున్నారు. ఓపిక తక్కువ, వెంటనే అన్ని తమ కాళ్ల దగ్గరకు వచ్చేయాలన్న మనస్థత్వాలతో ఉంటున్నారు. దీని కారణంగా ఓటమిని తీసుకోలేకపోతున్నారు.
Krishna Kowshik
ఉద్యోగం పురుష లక్షణం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడు ఆడవాళ్లు సైతం సంపాదిస్తున్నారు. చిన్న చితకా ఉద్యో గమైనా లేదా స్వయం ఉపాధి అయినా సృష్టించుకుంటున్నారు. మహిళల్ని ఉద్యోగాల్లో నియమించుకునేందుకు కూడా సంస్థలు ఆసక్తి చూపడంతో ఇటీవల కాలంలో జాబ్స్ చేస్తున్న మహిళల సంఖ్య పెరిగింది. తిని కూర్చుంటే కొండలైనా కరుగుతాయన్న మాటలు చెవికి ఎక్కించుకుని, తమకు చేతనైన పని చేస్తూ.. ఇంటికి కూడా చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు మహిళలు. అయితే ఇదే ఉద్యోగం కోసం వెతికి వెతికి వేశారిన ఓ యువతి మాత్రం నిరాశకు గురై దారుణాతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ఆ అమ్మాయి ఏం చేసిందంటే..?
ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రావడం లేదు. ఎక్కడకు వెళ్లినా మొండి చేయి ఎదురౌతుంది. దీంతో జీవితంలో తనకు జాబ్ రాదనుకుని భావించిన యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన హైదరాబాద్ ఉప్పల్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ సాయిరాం నగర్ కాలనీకి చెందిన బండిపెల్లి ఎల్లాభాయ్ కూతురు, అల్లుడు మరణించారు. అయితే వీరికి ఇద్దరు పిల్లలు సాత్విక, భవిష్క. కూతరు మరణించాక.. వారి బాధ్యతలను తన భుజాన ఎత్తుకుంది ఎల్లాభాయ్. వారిని చేరదీసి పెంచుతోంది. ఈ క్రమంలో 22 ఏళ్ల సాత్విక చదువు పూర్తయ్యాక అమ్మమ్మకు, చెల్లెలికి ఆసరాగా నిలవాలని ఆశించింది.
దీంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎక్కడకు వెళ్లినా జాబ్స్ రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఇక తనకు ఉద్యోగం రాదని భావించిన సాత్విక ఇంట్లో ఎవ్వరు లేని సమయం చూసి తన బెడ్ రూంలోకి వెళ్లి సీలింగ్ ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. ఇంటికి వచ్చి చూసే సరికి ఉరికి వేలాడుతూ కనిపించింది. కూతుర్ని, అల్లుడ్ని పొగొట్టుకున్న బాధలో ఉన్న ఎల్లాభాయ్.. ఇప్పుడు మనవరాలు కూడా చనిపోవడంతో కన్నీరుమున్నీరు అవుతోంది. అమ్మమ్మ ఎల్లాభాయ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం ఉద్యోగం రాలేదన్న వేదనలో ఇలాంటి పని చేసింది ఆ అమ్మాయి. ఇలాంటి విషయాలకు ఆత్మహత్య చేసుకోవడం సరైన చర్య కాదని చెబుతున్నారు వైద్యులు.