iDreamPost
android-app
ios-app

DSPతో సహా 50 మందితో వివాహం! ఫస్ట్ నైట్ అవ్వగానే భర్తని మార్చేస్తూ!

సత్య.. అందాన్ని పెట్టుబడిగా పెట్టుకుని మగవాళ్లను ఎర వేస్తుంది. పెళ్లి కాని కుర్రాళ్లు, పోలీసు అధికారులు, ఫైనానర్లకు వల వేస్తుంది. ఇక ఆమె మాయలో పడ్డారంటే.. బయటపడటం కష్టమే..

సత్య.. అందాన్ని పెట్టుబడిగా పెట్టుకుని మగవాళ్లను ఎర వేస్తుంది. పెళ్లి కాని కుర్రాళ్లు, పోలీసు అధికారులు, ఫైనానర్లకు వల వేస్తుంది. ఇక ఆమె మాయలో పడ్డారంటే.. బయటపడటం కష్టమే..

DSPతో సహా 50 మందితో వివాహం! ఫస్ట్ నైట్  అవ్వగానే భర్తని  మార్చేస్తూ!

ఈ ఫోటోలోని మహిళ పేరు సత్య. ఆరు నెలల క్రితం ఓ అబ్బాయితో ఆన్ లైన్ మ్యారేజ్ పోర్టల్‌లో పరిచయం అయ్యింది. ఆమె కోసం తల్లిదండ్రులను ఒప్పించాడు. కాబోయే కోడలి కోసం నగలు, చీరలు కొన్నారు. గుడిలో పెళ్లి చేసుకున్నారు ఈ జంట. అయితే తొలుత వీరి కాపురం హాయిగా సాగిపోయింది. అంతలో ఆమె కదలికలపై అనుమానాలు ఏర్పడ్డాయి భర్తకు. ఏంటో తేడాగా ఉందో.. ఆమె చెబుతున్న వయస్సుకు, ఆమె రూపు రేఖలకు అసలు సంబంధమే లేదే అనుమానం వ్యక్తం చేశాడు. ఆమె ఆధార్ పరిశీలించగా.. ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన ప్లేసులో మరో వ్యక్తి పేరు ఉండటంతో ఒక్కసారిగా మబ్బులు వీడాయి. చివరకు భార్య సత్యను ప్రశ్నించగా.. ఆమె అసలు స్వరూపం చూసి ఖంగుతిన్నారు భర్త, ఆమె కుటుంబ సభ్యులు.

దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిజం వెలుగులోకి వచ్చింది. ఆమెకు ఈ ఒక్కడే కాదు.. 50 మంది బాధితులయ్యారని. అందులో పోలీసు ఉన్నతాధికారులు ఉండటం గమనార్హం. డీఎస్పీతో సహా పలువురిని వివాహం చేసుకుని.. ఫస్ట్ నైట్ కాగానే.. కొన్ని రోజులకే  గొడవ పడి ఆ తర్వాత ఆమె డబ్బుతో ఉడాయించేది. ఈ నిత్య పెళ్లి కూతురు, కిలాడీ లేడీ పట్టుబడింది ఎక్కడా అంటే తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలో. ఇంత మందిని మోసం చేసిన ఈ మహిళ ఎలా దొరికిపోయిందంటే.. తారాపురానికి చెందిన ఓ యువకుడు బేకరీ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అతడికి 35 ఏళ్లు అయినా పెళ్లి కాలేదు. ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు అంబి డేట్ ద తమిళ్ వే అనే ఆన్ లైన్ వివాహ వేదికను సంప్రదించగా.. అక్కడ సత్య డిటైల్స్ నచ్చి.. పెద్దలను ఒప్పించాడు. అయితే పెళ్లికి కావాల్సిన నగలు, చీరలు కొన్నారు. పళని సమీపంలోని ఓ దేవాలయంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

అయితే పెళ్లైన 3 నెలల తర్వాత ఆమె రూపు రేఖలు, ప్రవర్తన తీరు భర్తకు అనుమానం కలిగించింది. ఆమె ఆధార్ కార్డును పరిశీలించగా.. భర్త స్థానంలో మరో పేరు ఉంది. నిలదీయగా.. చంపేస్తానంటూ బెదిరించింది సత్య. దీంతో అతడు తారాపురంలోని మహిళా పోలీసులను ఆశ్రయించాడు. ఆమె పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది. సత్య గురించి విచారించగా.. ఆమెకు గతంలో పెళ్లై ఓ బాబు ఉన్నాడని తెలిసింది. అయితే మరింత దర్యాప్తు చేపట్టగా.. బాధితుల్లో కరూర్‌లో ఒక డీఎస్పీ, ఒక పోలీసు ఇన్‌స్పెక్టర్, మదురైలో మరో పోలీసు అధికారి, కరూర్‌లో ఒక ఫైనాన్స్ అధికారితో సహా 50 మందికి పైగా సత్య వివాహం చేసుకుని మోసం చేసిందని తేలింది. పెళ్లయిన కొద్ది నెలల్లోనే సత్య భర్తతో గొడవపడి నగల డబ్బుతో అదృశ్యమైపోతుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.