iDreamPost
android-app
ios-app

పెళ్లై మూడు నెలలు.. గుడికి వెళ్లొచ్చిన భార్యా భర్తలు.. అంతలోనే

సంసార సాగర మాధుర్యం కచ్చితంగా నిలకడ మీదే తెలుస్తోంది అంటారు పెద్దలు. కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య అవగాహన లోపం ఉంటుంది. ఒకరి గురించి మరొకరికి తెలియకపోవడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు, సమస్యలు వస్తుంటాయి..

సంసార సాగర మాధుర్యం కచ్చితంగా నిలకడ మీదే తెలుస్తోంది అంటారు పెద్దలు. కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య అవగాహన లోపం ఉంటుంది. ఒకరి గురించి మరొకరికి తెలియకపోవడం వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు, సమస్యలు వస్తుంటాయి..

పెళ్లై మూడు నెలలు.. గుడికి వెళ్లొచ్చిన భార్యా భర్తలు.. అంతలోనే

పెళ్లి అనగానే అమ్మాయిలకు, అబ్బాయిలకు కొన్ని అంచనాలుంటాయి. భర్త తన మాట వినాలని, తనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తూ ఉంటుంది పత్ని. భార్య ప్రేమగా పలకరించాలని, తన అమ్మ నాన్నలను కంటికి రెప్పలా చూసుకోవాలని భావిస్తాడు భర్త. పెళ్లై అత్తింట్లో అడుగు పెట్టిన అమ్మాయికి.. కొత్త కాపురం కాస్త వింతగా ఉన్నా ఎడ్జస్ట్ అవుతూ, అలవాటు పడుతూ ఉంటుంది. ఇద్దరూ ఒకరికిఒకరు కొత్తే కాబట్టి.. ప్రతి విషయంలోనూ అభిప్రాయ బేధాలు, చిన్ని చిన్ని గిల్లికజ్జాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. కాసేపు ఇగోలు అడ్డొచ్చి.. మాట్లాడుకోకపోయినా.. తల్లిదండ్రులు వారికి సర్ది చెబుతూ ఉంటారు. కానీ ఈ కొత్త పెళ్లి కూతురు మాత్రం దారుణ నిర్ణయం తీసుకుంది.

తమిళనాడులోని సేలం జిల్లా వజప్పాడి సమీపంలోని టుకియంబాలయం మరియమ్మన్ ఆలయ ప్రాంతానికి చెందిన కతిర్వేల్ కుమారుడు అరుల్ మురుగన్‌కు సమతువపురానికి చెందిన అభిరామికి మూడు నెలల క్రితం వివాహమైంది. ఇప్పుడిప్పుడే భార్యా భర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటున్నారు. నూతన వధూవరులిద్దరూ సోమవారం స్థానిక ఆలయానికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. ఈ క్రమంలో ఏమైందో ఏమో ఇద్దరూ గొడవ పడ్డారు. భర్త తనపై అరవడంతో కోపంతో రగిలిపోయిన అభిరామి.. ఇంటి నుండి బయటకు పరుగులు తీసింది. ఆమె వెనుకే భర్త కూడా పరుగులు పెట్టాడు. అయితే అభిరామి ఇంటికి సమీపంలో ఉన్న 100 అడుగుల లోతైన వ్యవసాయ బావిలోకి క్షణం కూడా ఆలోచించకుండా దూకేసింది.

భార్య అభిరామి బావిలోకి దూకేయడంతో షాక్ తిన్న భర్త అరుల్ కూడా.. ఆమెను కాపాండేందుకు అతడు కూడా బావిలోకి జంప్ చేసేశాడు.లోతు చాలా ఎక్కువ ఉండటంతో నూతన దంపతులిద్దరూ మృతి చెందారు. కుటుంబ సభ్యులు.. స్థానికులు వజప్పాడి అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని బావిలోని ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సేలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హాయిగా సాగిపోవాల్సిన సంసారం.. మూడు నెలల ముచ్చటగానే మిగిలిపోయింది. ఇటీవల తమ చేతులతో ఆశీర్వదించిన ఈ జంట.. ఇలా విగతజీవులుగా పడి ఉండటంతో కన్నీరుమున్నీరు అయ్యారు స్థానికులు. క్షణికావేశంలో యువతి తీసుకున్న నిర్ణయం.. మరొకరి మృతికి కూడా కారణమైంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి