iDreamPost
android-app
ios-app

7 ఏళ్ల ప్రేమ.. ప్రియుడ్ని నమ్మి సర్వస్వం అప్పగిస్తే..

ప్రేమ పేరుతో కల్లబొల్లి కబుర్లు చెప్పగానే.. ఆ మాయ మాటలకు పడిపోతున్నారు అమ్మాయిలు. సర్వస్వం అప్పగించేస్తున్నారు కూడా. అయితే అతడి అసలు రంగు బయటపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా ఓ అమ్మాయి.. ఇలానే మోసపోయింది

ప్రేమ పేరుతో కల్లబొల్లి కబుర్లు చెప్పగానే.. ఆ మాయ మాటలకు పడిపోతున్నారు అమ్మాయిలు. సర్వస్వం అప్పగించేస్తున్నారు కూడా. అయితే అతడి అసలు రంగు బయటపడేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. తాజాగా ఓ అమ్మాయి.. ఇలానే మోసపోయింది

7 ఏళ్ల ప్రేమ.. ప్రియుడ్ని నమ్మి సర్వస్వం అప్పగిస్తే..

ఈ రోజుల్లో ప్రేమకు నిర్వచనాన్ని మార్చేస్తున్నారు ప్రేమికులు. క్రష్,ఇన్ ఫ్యాచ్చుయేషన్ పట్టుకుని లవ్ అనే భ్రమలో పడిపోయి.. సినిమాలు, షికార్లు, పార్కులు, పబ్బులు చుట్టూ ప్రేమ పక్షుల్లా విహరిస్తూ ఉంటారు. లవ్ అనే ముసుగులో హద్దులు కూడా దాటేస్తుంటారు. అంత వరకు బాగానే ఉంటుంది కానీ.. ఎప్పుడైతే.. ప్రియురాలు ప్రెగ్నెంట్ అని తెలుస్తుందో అప్పుడు ప్రియుడి అసలు రంగు, రూపం బయటకు వచ్చేస్తుంది. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే.. ప్రెగ్నెంట్ అని తెలియగానే.. పెళ్లి చేసుకుంటాడు. లేదంటే.. ఆమె మోహం చాటేస్తుంటాడు. అలా మోసం చేసిన ప్రియుడ్ని కటకటాలు లెక్కబెట్టేలా చేసింది ప్రియురాలు. వివరాల్లోకి వెళితే..

ఏడేళ్ల ప్రేమ.. పెళ్లి కాకుండానే సర్వస్వం అప్పగించింది. దీనికి ప్రతిఫలంగా మూడు సార్లు గర్భిణీ అయ్యింది. అయితే అబార్షన్ చేయించినా తట్టుకుంది కానీ.. ప్రియుడు మరొకర్ని మనువాడుతున్నాడని తెలిసి.. అతడి ఇంటి ముందు ధర్నాకు దిగడమే కాకుండా.. పోలీసులు ప్రియుడ్ని అదుపులో తీసుకునేలా చేసింది. ఈ ఘటన తమిళనాడులోని మైలాడుతురై జిల్లాలోని సెంగుడి గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన పొన్నియన్ కుమార్తె సుఖ ప్రియా చెన్నైలో నర్సింగ్ ఉద్యోగం చేస్తుంది. అదే ప్రాంతానికి చెందిన అళగర స్వామి కుమారుడు వినోద్, ప్రియా ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. వినోద్ గతంలో విదేశాల్లో పనిచేసి రాగా, ప్రస్తుతం టాటా ఏసీ వాహనాన్ని నడుపుతున్నాడు.

వినోద్.. ప్రియురాలు ప్రియతో కలిసి పుదుచ్చేరి, వేళాంగిణి, చెన్నై ఇతర ప్రాంతాల్లో తిరిగేవారు. ఈ క్రమంలో ఇద్దరు ఒక్కటయ్యారు. దీంతో పలుమార్లు గర్భిణీ అయ్యింది ప్రియ. రెండు సార్లు అబార్షన్ చేయించాడు వినోద్. మూడోసారి గర్భం దాల్చగా..ఇక తప్పదని తెలిసి.. గత నవంబర్‌లో ఆమెను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమెకు పౌష్టికాహార ట్యాబెట్ అంటూ అబార్షన్ అయ్యే మెడిసన్ ఇవ్వడంతో ఆమెకు అబార్షన్ అయ్యింది. చివరకు ఆమెను కాదని, మరొకరిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు ప్రియుడు. దీంతో ఆమె మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వారు పట్టించుకోకపోవడంతో.. అతడి ఇంటికి వెళ్లి.. బైఠాయించింది. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసుకుని వినోద్ ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Jojobet GirişMadridbetMariobetimajbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişgrandpashabet giriş