iDreamPost
android-app
ios-app

ఇంట్లో నుండి తల్లీ, కూతుళ్లు మాయం.. మరుసటి రోజు

తల్లిదండ్రులకు కూతురైనా, కొడుకైనా సమానమే. కానీ కూతురి అన్ని విషయాలను తండ్రితో పంచుకోలేదు. అలాంటి విషయాలను తన తల్లితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. దీంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలానే ఈ తల్లికూతుళ్లు కూడా.. కానీ

తల్లిదండ్రులకు కూతురైనా, కొడుకైనా సమానమే. కానీ కూతురి అన్ని విషయాలను తండ్రితో పంచుకోలేదు. అలాంటి విషయాలను తన తల్లితో షేర్ చేసుకుంటూ ఉంటుంది. దీంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. అలానే ఈ తల్లికూతుళ్లు కూడా.. కానీ

ఇంట్లో నుండి తల్లీ, కూతుళ్లు మాయం..  మరుసటి రోజు

కూతురికి ఎంత బాధ వచ్చినా తండ్రి కన్నా ముందు తల్లికే చెప్పుకుంటుంది. కూతురిలో భయాన్ని పొగొట్టి.. ధైర్యాన్ని నింపుతుంది తల్లి. వేదనను మరిచిపోయేలా చేయగలిగే సత్తా ఒక్క తల్లి లాలనలోనే ఉంటుంది. అలాగే కూతురి అవసరాలు గుర్తించి.. అన్ని సమకూర్చేది కూడా అమ్మే. ఇక ఈడుకు వచ్చిన ఆడపిల్లనైతే కంటికి రెప్పలా కాపాడుతుంది. పాడు కళ్లు పడకుండా.. జాగ్రత్త పడుతుంది. ఓ అయ్య చేతిలో పెట్టేంత వరకు విద్యా బుద్దులు నేర్పిస్తుంది. అలాగే తల్లి కూడా తన ఆవేదన చెప్పుకునేందుకు ఎవ్వరూ లేకపోతే.. తన కుమార్తెతోనే పంచుకుంటుంది. తల్లి కూతురి మధ్య కేవలం బాంధవ్యమే కాదూ.. అంతకు మించిన సాన్నిహిత్యం, ప్రెండ్ షిప్ ఉంటుంది.

ఇదిగో ఈ ఫోటోలోని అమ్మ, కూతుర్లదీ కూడా అలాంటి బంధమే. కానీ ఏం కష్టమోచ్చిందో తెలియదు కానీ.. ఇద్దరు..నదిలో శవమై తేలారు. ఇంట్లో నుండి వెళ్లిపోయిన మరుసటి రోజే ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో చోటుచేసుకుంది. షహబాద్ సమీపంలో కాగినా నదిలో దూకి తల్లి, కూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే చీరతో ముడి గట్టుకుని.. నీటిలోకి దూకేశారు. వెంటనే ఈతగాళ్లు, మత్స్యకారుల నదిలోకి దూకి వారిద్దర్ని బయటకు తీశారు. కానీ అప్పటికే వీరిద్దరూ మరణించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. అక్కడకు చేరుకున్న పోలీసులు.. వీరిద్దరిని తల్లి, కూతుళ్లు సుమలత, వర్షలుగా గుర్తించారు.

ప్రాథమిక విచారణలో వీరిది అఫ్సలాపూర్ తాలూకాలోని నిలూర్ విలేజ్ వాసులుగా తేలింది. ముందు రోజు సాయంత్రం నుండి కనిపించకుండా పోయారని తేలింది. సుమలత, వర్షలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగులో ఆందోళన నెలకొంది. కానీ వారంతా క్షేమంగా ఇంటికి వస్తారని ఊహించారు. కానీ అనూహ్యంగా వారి మరణ వార్త చేరడంతో దిగ్భ్రాంతిని వ్యక్తం చేయడంతో పాటు కన్నీరు మున్నీరు అయ్యారు. కాగా, పోలీసులు చెబుతున్న దాని ప్రకారం.. కొన్ని రోజుల నుండి తల్లి కూతుళ్లు మానసిక కుంగుబాటుకు గురయ్యారని.. అందువల్లే ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. కేసు దర్యాప్తు చేపడుతున్నారు.