iDreamPost
android-app
ios-app

2 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. పెళ్లి రోజే ఆ పరిస్థితిలో భార్యను చూసి

  • Published Apr 13, 2024 | 2:40 PM Updated Updated Apr 13, 2024 | 2:40 PM

ఈమె ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే.. ఎంతో ఇష్టపడ్డ ప్రియుడ్ని మనువాడింది. తల్లిదండ్రుల్ని ఎదురించి మరీ వివాహం చేసుకుంది. అంతలో తల్లిదండ్రులు కూడా వీరి ప్రేమ వివాహాన్నియాక్సెప్ట్ చేశారు. కానీ ఆమె

ఈమె ఆనందానికి అవధుల్లేవు. ఎందుకంటే.. ఎంతో ఇష్టపడ్డ ప్రియుడ్ని మనువాడింది. తల్లిదండ్రుల్ని ఎదురించి మరీ వివాహం చేసుకుంది. అంతలో తల్లిదండ్రులు కూడా వీరి ప్రేమ వివాహాన్నియాక్సెప్ట్ చేశారు. కానీ ఆమె

  • Published Apr 13, 2024 | 2:40 PMUpdated Apr 13, 2024 | 2:40 PM
2 ఏళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. పెళ్లి రోజే ఆ పరిస్థితిలో భార్యను చూసి

ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు భవాని. సంతోషం అంటే ఆమెదే. ఎందుకంటే.. ప్రేమించిన వ్యక్తిని మనువాడింది. పెద్దలు వద్దన్నా కూడా వారిని ఎదురించి పెళ్లి చేసుకుంది. తొలుత తల్లిదండ్రులకు దూరం అయ్యానన్న బాధ ఉండేది. కానీ బంగారం లాంటి భర్త ముందు భవానికి అది చిన్నదిలా కనిపించింది. అంతలో తల్లిదండ్రులు కూడా మనస్సు మార్చుకుని ఆమెతో మాట్లాడటం స్టార్ట్ చేశారు. భవాని ఆనందానికి అవధుల్లేవు. తనకు పిల్లలు లేరన్న బాధ తప్ప. పెళ్లై రెండేళ్లు అవుతున్నా పిల్లలు కలగలేదన్న బాధ ఉండగా.. అంతలో ఆమె గర్భం దాల్చింది. తాను తల్లిని కాబోతున్నానని ఆనందంలో మునిగి తేలిపోయింది. తొలి కాన్పు పుట్టింట్లో చేసుకుందామని వెళ్లింది.

కానీ భర్త ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెళ్లి రోజే రాత్రే భవాని బలవన్మరణానికి పాల్పడింది. మరికొన్ని రోజుల్లో ఒడిలో చంటి బిడ్డతో ఉండాల్సిన ఆ మహిళ.. గర్బిణీగా ఉండగానే ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే తిరుచ్చికి సమీపంలో ఉన్న అరియలూరు జిల్లా జయంగొండం సమీపంలో నివసిస్తున్నారు భార్య భర్తలు శక్తివేల్, భవాని. వీరిది లవ్ మ్యారేజ్. శక్తివేల్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. తొలుత వీరి పెళ్లిని పేరెంట్స్ అంగీకరించలేదు కానీ ఆ తర్వాత ఒప్పుకున్నారు. అయితే ఇటీవల భవాని గర్భం దాల్చింది.

దీంతో తొలి కాన్పు పుట్టింట్లో పోసుకోవాలని తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. శుక్రవారం వీరి పెళ్లి రోజు కావడంతో పుట్టింటి నుండి తీసుకు వచ్చాడు భర్త శక్తివేల్. ఈ విషయంలో వీరిద్దరి మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. మాట మాట పెరిగింది. ఈ సమయంలో ఇంట్లో నుండి వెళ్లిపోయాడు శక్తివేల్. తీవ్ర మనస్థాపానికి గురైన భవాని..కడుపులో ఉన్న బేబీ గురించి కూడా ఆలోచన చేయకుండా..చున్నీతో ఉరి వేసుకుని చనిపోయింది. ఇంటికి వచ్చిన భర్త..భార్యను ఆ స్థితిలో చూడగా  షాక్‌కు గురై వెంటనే బంధువులకు సమాచారం అందించాడు. కాగా, భవాని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యానా అని దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetmoon girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş