iDreamPost
android-app
ios-app

రైల్వే ఉద్యోగం.. కుందనపు బొమ్మలాంటి భార్య.. కానీ అతడి పాడు బుద్ది

అతడికి మంచి ఉద్యోగం. రైల్వే జాబ్ కావడంతో భారీగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. భార్యగా వచ్చిన అమ్మాయి కుందనపు బొమ్మ. కానీ అతడిది మాత్రం పాడు బుద్ది.

అతడికి మంచి ఉద్యోగం. రైల్వే జాబ్ కావడంతో భారీగా కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు అమ్మాయి తల్లిదండ్రులు. భార్యగా వచ్చిన అమ్మాయి కుందనపు బొమ్మ. కానీ అతడిది మాత్రం పాడు బుద్ది.

రైల్వే ఉద్యోగం.. కుందనపు బొమ్మలాంటి భార్య.. కానీ అతడి పాడు బుద్ది

కూతుర్ని 20 -25 ఏళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న తల్లిదండ్రులు.. పెళ్లి చేసి పరాయి దాన్ని చేసేస్తారు. కేవలం అబ్బాయికి మంచి ఉద్యోగం ఉందా.. వెనుక ఎంత ఆస్తి ఉంది అని ఆలోచిస్తున్నారే తప్ప.. తన కూతుర్ని బాగా చూసుకుంటాడాన్న యోచన చేయట్లేదు. అతడు మంచి వ్యక్తా, కాదా అని పై పై ఎంక్వైరీ మాత్రమే చేస్తున్నారు. చుట్టు ప్రక్కల వారు కూడా మంచి వాడు కాదండే.. ఎక్కడ తమ మీద పడిపోతారన్న భయంతో ’అబ్బాయికేమ్మా బంగారం‘ అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతుంటారు. కానీ పెళ్లైన కొన్ని రోజులకు కానీ తెలియదు అతడి భాగోతం. కానీ ఇంతలోనే పిల్లలు పుట్టేయడం, చివరకు ఆస్తి, పాస్తులు అన్నీ అమ్మి, అప్పులు పాలై తనకు పెళ్లి చేయడంతో అటు కక్కలేక, మింగలేని పరిస్థితికి చేరుకుంటుంది అమ్మాయి. చివరకు తన దాని తాను వెతుక్కుతూ.. తిరిగి రాని లోకాలకు చేరుకుంటుంది.

అతడిది ప్రభుత్వ ఉద్యోగం. అబ్బాయిది గవర్నమెంట్ జాబ్ కావడంతో లక్షలు కట్నం ఇచ్చి కూతురికి పెళ్లి చేశారు. కానీ అత్తారింట్లో అమ్మ, కొడుకులకు డబ్బు పిచ్చి. మరింత కట్నం తీసుకురావాలంటూ ఆమెను హింసించడం మొదలు పెట్టారు. దీంతో పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయింది. కానీ అక్కడకు వెళ్లాక కూడా ఈ చీడ వదల్లేదు. ఫోన్ చేసి హింసిస్తుండగా.. జీవితంపై విరక్తితో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సూర్యా పేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగుల పాటి అన్నారం గ్రామానికి చెందిన అయోధ్య, సునీతల కుమార్తె చందన.. కొత్తగూడెం ప్రాంత నివాసి విజయలక్ష్మి కుమారుడు వేణుకు మూడేళ్ల క్రితం వివాహం అయ్యింది.

వేణు రైల్వే ఉద్యోగి కావడంతో చందనకు కట్న కానుకలు భారీగా ఇచ్చి పెళ్లి చేశారు. వేణు, చందనకు ఓ కొడుకు పుట్టాడు. అయితే పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నా.. ఇటీవల పుట్టింటికి వెళ్లి మరింత కట్నం తీసుకు రావాలంటూ హింసించడం మొదలు పెట్టారు భర్త, అత్త విజయ లక్ష్మి. దీంతో ఓ సారి పోలీసు కేసు పెట్టింది. అప్పటి నుండి బాబుతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయినా భర్త వేణు .. ఫోనులో వేదిస్తూ.. గతంలో తనపై పెట్టిన కేసు విత్ డ్రా చేసుకోవాలని బెదిరించడం మొదలు పెట్టాడు. వీటిని తట్టుకోలేపోయిన చందన.. పసి బిడ్డను ఒంటరి చేసి, ఇంట్లో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తెల్లారే చూసే సరికి ఉరి కొయ్యకు వేలాడుతోంది. షాక్ తిన్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అయ్యారు. చందన పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.