Krishna Kowshik
ఆ కుర్రాడికి 19 ఏళ్లు.. ఆమెకు 63 ఏళ్లు.. పిల్లాడే అని పిలిచి పనిలో పెట్టుకుంది ఆవిడ. కానీ పనిలో కుదిరిన రోజు నుండే ఆమెపై, ఆ ఇంటిపై ఓ కన్ను వేశాడు. చివరకు
ఆ కుర్రాడికి 19 ఏళ్లు.. ఆమెకు 63 ఏళ్లు.. పిల్లాడే అని పిలిచి పనిలో పెట్టుకుంది ఆవిడ. కానీ పనిలో కుదిరిన రోజు నుండే ఆమెపై, ఆ ఇంటిపై ఓ కన్ను వేశాడు. చివరకు
Krishna Kowshik
పోనీలే కుర్రాడు కదా.. పని ఇస్తే.. తిన్నింటి వాసాలు లెక్కబెట్టాడు. తిండి పెట్టి, జీతం ఇస్తోన్న ఇంటికే కన్నం వేశాడు. పనిలో కుదుర్చుకున్న మరుసటి రోజే అతడి వ్యవహారం బయట పడింది. ఇంట్లో డబ్బు, యజమానురాలిపై ఉన్న నగలు, హోదా అవన్నీ చూసి కన్ను కుట్టింది యువకుడికి. ఈ మొత్తం దోచేస్తే లైఫ్ సెట్ అయిపోతుందని భావించాడు. ఇంతలో ఎవ్వరూ లేని సమయంలో దొంగతనానికి పాల్పడేందుకు స్కెచ్ వేశాడు. యజమానురాలు చూడటంతో కంగుతిన్న యువకుడు.. ఆమెను మట్టుబెట్టి.. ఏమీ ఎరుగన్నట్లు పరారయ్యాడు. భర్త ఇంటికి వచ్చి చూడగా.. బెడ్ రూంలో భార్య విగతజీవిగా పడి ఉంది. పనిలో కుదుర్చుకున్న అబ్బాయి కనిపించకపోవడంతో అతడే ఈ నిర్వాకం చేసి ఉంటాడని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నగలతో పరారౌతున్న యువకుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని ముంబయిలోని నేపీన్ సీ రోడ్‌లో ఉన్న తాహ్నీ హైట్స్ అపార్ట్ మెంట్‌లో ముఖేష్, జ్యోతి అనే 20వ అంతస్థులో వృద్ధ దంపతులు జీవిస్తున్నారు. ముఖేష్‌కు జ్యూయలరీ షాప్ ఉంది. ఇంట్లో పనికి సోమవారం కన్హయ్య కుమార్ అనే 19 ఏళ్ల యువకుడ్ని నియమించుకున్నారు. మంగళవారం.. ఇంటికి వచ్చిన ముఖేష్.. కాలింగ్ బెల్ కొట్టడంతో తలుపు తీయలేదు. తన వద్ద ఉన్న స్పేర్ కీతో తలుపు తీసి.. చూడగా.. బెడ్ రూంలో జ్యోతి పడిపోయి కనిపించింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా.. ఆమె మరణించినట్లు నిర్ధారించారు వైద్యులు.
బీహార్ దర్బంగాకు చెందిన కన్హయ్య కనిపించకపోవడంతో పాటు రెండు డైమండ్, బంగారు గాజులు, రెండు లక్షల క్యాష్ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగతనం చేస్తుండగా.. చూడటంతో యజమానురాలి గొంతు నులిమి చంపి.. ఆ తర్వాత పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. 15 ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏర్పాటు చేసి.. పలు ప్రాంతాల్లో సెర్చ్ చేశారు. ఓ రైలులో బీహార్ పరారవుతున్నాడని సమాచారం అందుకున్న పోలీసులు.. అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి నుండి దొంగతనం చేసిన నగలు, డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. అతడిపై పలు కేసులు నమోదు చేసి.. మరింత విచారణ చేపడుతున్నారు