iDreamPost
android-app
ios-app

తిట్టాడని కన్న కొడుకుని గొంతు నులిమి చంపిన తల్లి.. అమ్మతనానికే మాయని మచ్చగా

అమ్మను మించిన దైవమున్నదా.. అని సినీ కవి అన్నట్లుగా.. ఈ లోకంలో కనిపించే దేవత అమ్మ. అపురూపమైన బంధం తల్లి-పిల్లల బంధం. పిల్లల కోసం తన ప్రాణాలైనైనా లెక్క చేయదు తల్లి. కానీ

అమ్మను మించిన దైవమున్నదా.. అని సినీ కవి అన్నట్లుగా.. ఈ లోకంలో కనిపించే దేవత అమ్మ. అపురూపమైన బంధం తల్లి-పిల్లల బంధం. పిల్లల కోసం తన ప్రాణాలైనైనా లెక్క చేయదు తల్లి. కానీ

తిట్టాడని కన్న కొడుకుని గొంతు నులిమి చంపిన తల్లి.. అమ్మతనానికే మాయని మచ్చగా

తల్లిని మించిన యోధులు, దైవం లేదంటారు. ఏ బంధమైనా మారిపోతుంది కానీ.. పేగు బంధం మారదు. ఎంత మంది పిల్లలున్నా.. అందరిని ఓకేలా చూస్తుంది తల్లి. బిడ్డల ఆకలి తల్లికి మాత్రమే తెలుసు. తనకు లేకపోయినా.. కడుపున పుట్టిన వాళ్ల బొజ్జ నింపాలని తాపత్రయ పడుతుంది. తన బిడ్డల తర్వాత భర్తకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. కానీ ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు అమ్మతనానికి మాయని మచ్చలా మారుతున్నాయి. తాజాగా అటువంటి సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో చోటుచేసుకుంది. తన ప్రవర్తన బాగోలేదని కొడుకు తిట్టాడన్న కోపంతో గొంతు నలిమి చంపేసింది ఓ కసాయి తల్లి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ నెల 11న పటాన్ చెరు మండలం ముత్తంగి బాహ్య వలయ సర్వీసు రోడ్డు పక్కన ఓ బాలుడు మృతదేహం కనిపించింది. స్థానికులు గమినించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి ఈ బాలుడు వివరాలు తెలపాలంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అయితే ఆ బాలుడు పాత రామచంద్రపురానికి చెందిన స్వాతి కొడుకు విష్ణువర్థన్ అని గుర్తించారు. పోలీసులు బాలుడు ఇంటికెళ్లగా.. తాళం వేసి ఉంది. చుట్టుపక్కల వాకబు చేయగా తండ్రి కుమార్ ఏడాది క్రితం చనిపోయాడని, తల్లి వద్దే కొడుకు ఉంటున్నట్లు చెప్పారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి నిఘా వేసి ఉంచారు. ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన స్వాతిని పట్టుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా.. తొలుత ఆత్మహత్య అని.. ఆ తర్వాత తానే చంపేసినట్టు చెప్పింది.

స్వాతికి ఇది వరకే పెళ్లి కాగా, భర్త కుమార్ చనిపోవడంతో చీమకుర్తికి చెందిన అనిల్‌ను రెండో వివాహం చేసుకుంది. బాలుడు వీరి వద్దే ఉంటున్నాడు. అయితే ఈ నెల 10న కుమారుడు  విష్ణువర్ధన్‌  దుర్భాషలాడటంతో మద్యం మత్తులో ఉన్న స్వాతి అతడి గొంతు నులిమి హత్య చేసింది. దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించింది. రెండో భర్తకు కూడా ఇదే చెప్పింది. అయితే స్వగ్రామం కామారెడ్డి జిల్లా పుల్కంపేట గ్రామానికి తరలించాలని భావించగా..మృతదేహాన్ని ఇక్కడికి తీసుకురావద్దని మీరున్న చోటే దహన సంస్కారాలు చేయాలని చెప్పారు. దీంతో ఏమి చేయాలో తెలియక రెండో భర్త అనిల్‌తో ద్విచక్ర వాహనంపైకి ఎక్కించుకొని ముత్తంగి బాహ్యవలయ సర్వీస్‌ రహదారి పక్కన పడేశామని విచారణలో తెలిపింది తల్లి. దీంతో స్వాతి, అనిల్‌ను అరెస్టు చేసి శనివారం రిమాండ్‌ తరలించారు.