ప్రేమ పేరుతో వేధింపులు.. తట్టుకోలేక యువతి ఆత్మహత్య!

తెలిసిన వాడేనని భావించి ఇన్ స్టాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేసింది. అంతే.. అక్కడితో ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఆమెను ప్రేమ పేరుతో హింసించడం స్టార్ట్ చేశాడు యువకుడు. చివరకు...

తెలిసిన వాడేనని భావించి ఇన్ స్టాలో ఫ్రెండ్ రిక్వెస్ట్ వస్తే యాక్సెప్ట్ చేసింది. అంతే.. అక్కడితో ఆమెకు మనశ్శాంతి లేకుండా పోయింది. ఆమెను ప్రేమ పేరుతో హింసించడం స్టార్ట్ చేశాడు యువకుడు. చివరకు...

ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించడంతో తట్టుకోలేక ఓ యువతి దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంటి నాలుగో అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుమ్మదిదల మండలం దోమడుగులో నివసిస్తోంది తేజశ్విని కుటుంబం. తేజశ్విని బీ ఫార్మసీ చదువుతుంది. కాగా, ఆమె ఇంటికి సమీపంలో నివసిస్తున్న యువకుడితో ఇన్ స్టాలో పరిచయం ఏర్పడింది. అప్పటి నుండి ప్రేమించాలంటూ యువతిని వేధిస్తున్నాడు. ఆమె నో చెప్పడంతో అవి మరింత ఎక్కువయ్యాయి. అంతేకాకుండా ఆమె తల్లిదండ్రులను కూడా బెదిరించాడు. దీంతో మనస్థాపానికి గురైన తేజశ్వినీ.. అతడు చేసిన తప్పుకు తాను శిక్ష వేసుకుంది.

కన్ స్ట్రక్షన్ జరుగుతున్న తన నాలుగో అంతస్తు పైకి వెళ్లి కిందకు దూకేసింది. పెద్ద శబ్దం రావడంతో కిందకు వెళ్లి చూడగా.. కూతురు రక్తపు మడుగుల్లో పడి ఉంది. తేజశ్విని హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు తల్లిదండ్రులు. ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యంలో మరణించింది. దీంతో పేరెంట్స్, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రేమ పేరుతో యువకుడు వేధించడం వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతిని వేధించిన యువకుడు గంజాయి బ్యాచ్‌కు చెందిన వాడని ఆరోపిస్తున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు.

ఒకే గ్రామానికి చెందిన వాడని తెలిసి పరిచయం పెంచుకుంటే.. ఆమెను వేధించడం స్టార్ట్ చేశాడు. సోషల్ మీడియా వేదికగా తేజశ్వినిని అస్తమాను వేధించడంతో పాటు, మరికొంత మంది బ్యాచ్ తో కలిసి ఇబ్బందికి గురి చేశాడు.  ఆమె తల్లిదండ్రుల్ని కూడా వీరంతా కలిసి బెదిరించారు. చివరకు ఆమె ఆత్మహత్య చేసుకుంది. కూతురికి మృతికి వీళ్లే కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితురాలి పేరెంట్స్.  కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు. పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Show comments