Krishna Kowshik
ఈ ఫోటోలోని అమ్మాయి బీ ఫార్మసీ చదువుతోంది. ఆమెపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుండి ముభావంగా ఉంటుంది. అయితే..
ఈ ఫోటోలోని అమ్మాయి బీ ఫార్మసీ చదువుతోంది. ఆమెపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రెండు నెలల క్రితం ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుండి ముభావంగా ఉంటుంది. అయితే..
Krishna Kowshik
నేటి యువత చిన్న చిన్న విషయాలకు అలుగుతున్నారు. పేరెంట్స్ అడిగింది ఇవ్వకపోయినా.. మార్కులు తక్కువచ్చాయేంటీ అని ప్రశ్నించినా.. మనస్థాపానికి గురౌతున్నారు. ప్రేమికుడు లేదా ప్రేయసి ప్రపోజ్ చేయలేదని ఒకరు..మోసం చేసి, మరొకర్ని మనువాడుతున్నారని మరొకరు దారుణ నిర్ణయాలకు పాల్పడుతున్నారు. కుటుంబ సమస్యలతో కొందరు.. భార్య భర్తల మధ్య గొడవలతో మరికొందరు ఆవేశానికి, అతి ఆలోచనకు గురై.. క్షణికంలో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యార్థి, యవ్వన దశలో ఎక్కువ మంది ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిలుస్తున్నారు.
ఉన్నత చదువులు చదివి.. కుటుంబానికి ఆసరాగా నిలుస్తుందనుకున్న కూతురు ఇలాంటి నిర్ణయమే తీసుకుంది. రెండు నెలల కింద ఇంటి వచ్చిన అమ్మాయి.. ముభావంగా ఉంటుంది. ఏమి జరిగిందో చెప్పడం లేదు. కానీ చివరకు ఉరి కొయ్యకు వేలాడింది. వివరాల్లోకి వెళితే. . సంగారెడ్డి జిల్లాలోని సదాశివ పేట పట్టణంలోని గురునగర్ కాలనీలో నివసిస్తోంది మన్నే అశోక్ కుటుంబం. అతడి పెద్ద కుమార్తె శివానీ హైదరాబాద్‌లో బీ ఫార్మసీ చదువుతోంది. రెండు నెలల క్రితం ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుండి ముభావంగా ఉంటోంది. ఇది గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఒకింట పసిగడుతూనే ఉన్నారు. అయితే సోమవారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి.. ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
అయితే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లి పరిశీలించగా.. ఆమె సూసైట్ నోట్ లభించింది. అందులో ‘నాకు ఇతరులకు సాయం చేయడం అంటే ఇష్టం. నా తల్లిదండ్రుల అనుమతితో నా అవయవాలను దానం చేయాలని కోరుతున్నా. నేను లేకున్నా నా అవయవాల కారణంగా మరో ఇద్దరు జీవిస్తారేమోనని ఆశ. నా చావుకు నేనే కారణం. దయచేసి ఎలాంటి విచారణ చేయొద్దు’అని లేఖలో పేర్కొంది. అయితే బ్రెయిన్ డెడ్ కావడంతో అవయవాలు పనికి రావని వైద్యులు తెలిపారు. మృతురాలి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అయితే ఆమె ఎందుకు మనస్థాపానికి గురైందో వివరాలు తెలియరాలేదు. శివానీ సాయం చేయాలన్న మనస్సు మంచిదే కానీ.. తాను ప్రాణాలు బలవంతంగా తీసుకుని, ఇద్దరికి ప్రాణాలు ఇవ్వాలనుకోవడం ఏం ఆలోచనే అర్థం కావడం లేదు.