Krishna Kowshik
పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు పేరెంట్స్. ముఖ్యంగా ఆడ పిల్లలపై. వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కానీ చేతికొచ్చిన తర్వాత..
పిల్లలపై ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు పేరెంట్స్. ముఖ్యంగా ఆడ పిల్లలపై. వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. కానీ చేతికొచ్చిన తర్వాత..
Krishna Kowshik
పిల్లల్ని కంటాం కానీ వారి తల రాతల్ని కనలేం అంటుంటారు పెద్దలు. నిజమే మరీ.. పిల్లలు ఉన్నత చదువులు చదివి.. లైఫ్‌లో సెటిల్ కావాలని కోరుకుంటారు పేరెంట్స్. వారి గురించి ఎన్నో కలలు కంటుంటారు. వారిని ఎంతైనా చదివించేందుకు, ఏదైనా చేసేందుకు వెనకాడరు. ఈ రోజుల్లో ఆడ పిల్లలైనా, మగ పిల్లలు అని తేడా లేకుండా సమానంగా చూస్తున్నారు. విదేశాల్లో చదువుకుంటామని అని కూతురు కోరితే.. కాదనకుండా పంపిస్తున్నారు. ఆడ పిల్లకు చదువు ముఖ్యమని భావిస్తున్నారు నేటి పేరెంట్స్. కానీ చేతికొచ్చిన పిల్లలు.. తమ కళ్ల ముందే పిట్టల్లా రాలిపోతుంటే తల్లడిల్లిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. తాజాగా ఓ డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె మృతి పలు అనుమానాలకు తావునిస్తుంది. ఇది ఆత్మహత్య కాదు.. హత్య అని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. రంగా రెడ్డి జిల్లాలో. ఫరూక్ నగర్ మండలం కందివనం గ్రామంలో మానస అనే డిగ్రీ విద్యార్థిని ఇటీవల అనుమానాస్పద స్థితిలో మరణించింది. మానస ఉరి వేసుకుని కనిపించగా.. అదే గ్రామానికి చెందిన సమీప బంధువు రాములు అక్కడే ఉండడం కుటుంబ సభ్యులకు అనుమానం మొదలైంది. ఇక్కడ ఏం చేస్తున్నావ్ అని నిలదీస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పాడు రాములు. తనకు అప్పుడప్పుడు ఫోన్లు చేసేవాడనంటూ చెప్పేవాడు. దీంతో అనుమానాలకు బలం చేకూర్చినట్లయ్యింది. అయితే మానసపై రాములు మనసు పడినట్లు తెలుస్తోంది. పట్టణంలోని విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న మానస అనుమానాస్పద స్థితిలో మరణించింది.
అయితే రాములుకు గతంలో వివాహం కాగా, మాసనను ఇష్టపడినట్లు, రెండో వివాహం చేసుకునేందుకు వేధించినందు వల్లే ఆమె తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదుతో షాద్ నగర్ పొలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు పోలీసులు. అయితే ఇది ఆత్మహత్య? లేక హత్య? అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. మృతి పట్ల అనుమానాలు ఉండడంతో శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా.. మానసది హత్యేనని షాద్ నగర్ యువ సత్తా యూత్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. మరణించినప్పుడు రాములు అక్కడే ఉన్నాడని అతనే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటాడని అంటున్నారు. బంధువులు కూడా ఇదే రకమైన ఆరోపణలు చేస్తున్నారు. కూతురిపై పెరేంట్స్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, కానీ ఇలా చేస్తుందనుకోలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.