iDreamPost
android-app
ios-app

నంద్యాలలో బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం

  • Published Jul 10, 2024 | 5:17 PM Updated Updated Jul 10, 2024 | 5:17 PM

ఇంటా, బయటా ఎక్కడా ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది. చివరకు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. తాజాగా నంద్యాలలో ఘోరం జరిగింది.

ఇంటా, బయటా ఎక్కడా ఆడపిల్లకు రక్షణ లేకుండా పోయింది. చివరకు చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. తాజాగా నంద్యాలలో ఘోరం జరిగింది.

  • Published Jul 10, 2024 | 5:17 PMUpdated Jul 10, 2024 | 5:17 PM
నంద్యాలలో బాలికపై ముగ్గురు మైనర్ల అత్యాచారం

భారత న్యాయ వ్యవస్థలోని చట్టాలు ఎంత కఠినతరం చేసినా.. కీచకుల్లో మార్పులు రావడం లేదు. చిన్నారులపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణ శిక్ష విధించేలా కొత్త చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికీ.. ఏ మాత్రం బెదరడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్న పిల్లలపై అత్యాచారాలకు ఒడిగడుతున్నారు. ముక్కు పచ్చలారని పసికందులపై హత్యాచారాలకు పాల్పడుతున్నారు. పోక్సో, అభయ, నిర్భయ వంటి చట్టాలున్నప్పటికీ కించిత్ భయం కానీ బెరుకుకానీ లేకపోవడం శోఛనీయం. అయితే ఇప్పుడు మైనర్లే దారుణాలకు పాల్పడుతుండటం దారణం. సభ్య సమాజం తలదించుకునేలా, ఒళ్లు గగొర్పాటుకు గురి చేసేలా నంద్యాలలో ఘోరం జరిగింది. అభం, శుభం తెలియని 8 ఏళ్ల చిన్నారిని పొట్టనబెట్టుకున్నారు ముగ్గురు మైనర్ బాలురు.

నంద్యాల జిల్లా పగిడ్యాల మండలంలోని పాత ముచ్చుమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన బాలిక అదృశ్యమైంది. ఆదివారం ఆడుకునేందుకు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లగా సాయంత్రమైన ఇంటికి తిరిగి రాలేదు. దీంతో ఊరంతా వెతికారు. కనిపించకపోయే సరికి ఊరు ఊరంతా ఆ పాప కోసం వెతికింది. అయినప్పటికీ కానరాకపోవడంతో నందికొట్కూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఆమె తల్లిదండ్రులు. కేసు నమోదు చేసిన పోలీసులు.. జాగిలాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ ప్రయత్నంలో ఆమె ఓ దుకాణంలో కొనుక్కుందని, ఆమెను ముగ్గురు మైనర్లుతో కనిపించినట్లు గుర్తించారు. ఆ ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా పలు విషయాలు వెలుగు చూశాయి.

నిందితులు చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఉన్న పార్క్ వద్దకు ఆడుకోవడానికి వచ్చిన బాలికను.. ముగ్గురు మైనర్లు..సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి ఒడిగట్టారు. అయితే ఈ విషయం ఇంట్లో చెబుతుందేమోనని భయమేసి.. చివరకు హత్య చేసి.. కాలువలో పడేసినట్లు చెబుతున్నారు. దీంతో బాలిక కోసం పోలీసులు వెతుకుతున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. చిన్న పిల్లపై ఇంత దారుణానికి ఒడిగట్టడానికి కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.  ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే కూడా సీరియస్ అయ్యారు. ముగ్గురు మైనర్లను అరెస్టు చేసి మరింత విచారణ జరుపుతున్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom