Krishna Kowshik
ఆ అమ్మాయికి ప్రభుత్వ కొలువు కొట్టాలన్నది కల. దీంతో స్వంత గ్రామాన్ని వీడి.. పట్టణానికి పయనమైంది. ఓ రూం తీసుకుని ఉంటుంది. అలాగే..
ఆ అమ్మాయికి ప్రభుత్వ కొలువు కొట్టాలన్నది కల. దీంతో స్వంత గ్రామాన్ని వీడి.. పట్టణానికి పయనమైంది. ఓ రూం తీసుకుని ఉంటుంది. అలాగే..
Krishna Kowshik
స్వంత గ్రామాల్లో చదువుకుని, ఉన్నత చదువుల కోసం లేదా ఉద్యోగాలకు, మెరుగైన స్కిల్స్ సంపాదించాలని కోచింగ్ సెంటర్లలో ట్రైనింగ్ కోసం పట్టణాలకు పరుగులు పెడుతున్నారు యువతీ, యువకులు. ముఖ్యంగా అమ్మాయిలు.. తమ కాళ్ల తాము నిలబడాలని ఆలోచనతో పట్నం బాట పడుతున్నారు. ప్రభుత్వ కొలువైనా లేదా సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించాలన్నా ఉద్దేశంతో కోచింగ్ సెంటర్లకు వచ్చి.. ఇక్కడ హాస్టల్స్‌లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లిదండ్రుల్ని రూపాయి అడగకూడదని కొంత మంది అమ్మాయిలు పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేస్తూ.. ఎంతో కొంత సంపాదిస్తున్నారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండాలని అనుకుంటున్నారు. వచ్చిన సంపాదనలో ఇంట్లో కూడా సర్దుతున్నారు.
ఎప్పటికైనా తాము ఆశించిన ఉద్యోగాన్ని కొల్లగొట్టాలని ఆశిస్తున్నారు. అలాగే కలలు కనింది సంగీత కూడా. ఎప్పటికైనా ప్రభుత్వం కొట్టాలని భావించింది. తల్లిదండ్రులకు అండగా నిలవాలని కోరుకుంది. తనకు ఉన్నత చదువులు చెప్పిన తల్లిదండ్రులకు రుణాన్ని తీర్చాలనుకుంది. కానీ ఆ ఆశలన్నింటిని అడి ఆశలు చేసుకుంది సంగీత. గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనుకుంది కానీ.. ఆ ఆశ తీరకుండానే తరలిరాని లోకాలకు వెళ్లిపోయింది. తన చేతులతో తన ప్రాణాన్ని తానే తీసుకుంది. ఉద్యోగాన్ని సంపాదిస్తానా లేదా అన్న వేదనతో .. తీవ్ర ఒత్తిడికి గురై తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన తెలంగాణలోని నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…
నల్గొండ జిల్లాలోని నకిరేకల్‌కు చెందిన సంగీతకు గవర్నమెంట్ జాబ్ కుట్టాలన్నది కల. మేడ్చల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో గత కొంతకాలంగా నివాసం ఉంటూ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సిద్ధం అవుతోంది. గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. అయితే జూన్ నెలలో పరీక్షలు ఉన్నాయి. ప్రిపరేషన్ తీసుకున్నప్పటికీ తాను ప్రభుత్వ కొలువును కొడతానే లేదో అని మదనపడుతూనే ఉండేది. ఈ తరుణంలో తీవ్ర ఒత్తిడికి గురై తను ఉండే ఇంట్లోనే ఆత్మహత్య చేసుకుంది. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సంగీత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. అయితే ఆమె ఒత్తిడి వల్ల చనిపోయిందా అనే కోణంలో విచారణ చేపడుతున్నారు.