iDreamPost
android-app
ios-app

భార్య అందంగా ఉందని అనుమానించి..! ఓ భర్త దారుణం!

  • Published Aug 30, 2024 | 5:13 PM Updated Updated Aug 30, 2024 | 5:13 PM

భార్యా భర్తలు ఇద్దరు డాక్టర్లే. ఎంతో మంచి జీవితాన్ని ఊహించుకుంది. ఎన్నో కలలు కనింది. కానీ ఆమె కలలను కల్లలు చేశాడు భర్త. రోజు రోజుకు భర్త బండారం బయటపడ సాగింది. ఆమె అందం కూడా శాపంగా మారింది.

భార్యా భర్తలు ఇద్దరు డాక్టర్లే. ఎంతో మంచి జీవితాన్ని ఊహించుకుంది. ఎన్నో కలలు కనింది. కానీ ఆమె కలలను కల్లలు చేశాడు భర్త. రోజు రోజుకు భర్త బండారం బయటపడ సాగింది. ఆమె అందం కూడా శాపంగా మారింది.

  • Published Aug 30, 2024 | 5:13 PMUpdated Aug 30, 2024 | 5:13 PM
భార్య అందంగా ఉందని అనుమానించి..! ఓ భర్త దారుణం!

ఓ వైపు కోల్ కతా వైద్యురాలి ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంటే.. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ (చత్రపతి శంభాజీ నగర్) మరో లేడీ డాక్టర్ ఆత్మహత్య చర్చనీయాంశంగా మారింది. ఎంతో కష్టపడి వైద్య విద్యను అసభ్యసించి డాక్టరయ్యింది. ఎంతో జీవితాన్ని ఊహించుకుంది. కానీ కాళ్ల పారని ఆరక ముందే భర్త వేధింపులు తాళలేక బలవన్మరణానికి పాల్పడింది. అయితే చనిపోయే ముందు ఆమె సూసైడ్ నోట్ రాసుకుంది. భర్త తనను ఎలా హింసించే వాడో రాసుకొచ్చింది. అయితే భార్య మరణించగానే.. భర్త పరారయ్యాడు. అక్కడ నుండి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించగా.. పోలీసులు పట్టుకున్నారు. డా. ప్రతీక్ష గవారే సూసైట్ కేసులో ఒక్కొక్కటిగా విషయాలు వెలుగు చూస్తున్నాయి. భర్త డా. ప్రీతమ్ గవారే వరకట్న వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

స్థానికులు చెబుతున్న వివరాలు ఇలా ఉన్నాయి… డా. ప్రీతమ్‌కు ఈ ఏడాది మార్చి 27న ప్రతీక్షతో వివాహం అయ్యింది. అయితే భార్య అందంగా ఉండటంతో పెళ్లైన నాటి నుండే భర్త ఆమెను అనుమానించడం స్టార్ట్ చేశాడు. రష్యాలో డాక్టర్ చదివిన ప్రీతమ్.. ఇక్కడ సొంత ఆసుపత్రి కట్టాలని కలలు కనేవాడు. దీని కోసం భార్యను వరకట్నం తీసుకురావాలంటూ వేధించేవాడు. ఈ క్రమంలోనే.. ప్రముఖ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్‌గా జాయిన్ అయ్యింది ప్రతీక్ష. అప్పటి నుండి ఆమెకు మరింత టార్చర్ ఎక్కువైంది. ప్రతీక్ష క్యారెక్టర్‌పై ప్రీతమ్‌ ఎప్పటికప్పుడు అనుమానం వ్యక్తం చేసేవాడు. ఆమెమె మొబైల్ ఫోన్‌ని నిత్యం తనిఖీ చేయడంతో పాటు కాల్స్, మేసేజెస్ కూడా చెక్ చేసేవాడు. చివరకు ఆమె మొబైల్ ఫోన్ లాక్ కూడా తన వేలి ముద్రలను అనుసంధానించాడు. ప్రతీక్ష డ్యూటీకి వెళ్లినప్పుడు కూడా వదిలి పెట్టేవాడు కాదు.

నిత్యం ఆమెకు ఫోన్ చేసేవాడు. పొరపాటున ఆమె ఫోన్ ఎత్తకపోతే దుర్భాషలాడేవాడు. అంతేకాదు. స్నేహితులు, బంధువులతో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. దీనికి తోడు వరకట్న వేధింపులకు పాల్పడ్డాడు. ఆగస్టు 24న ఆపరేషన్ థియేటర్‌లో ఉండగా.. ఫోన్ చేసి హింసించాడు. ఆమె ఎత్తలేదు. తిరిగి కాల్ చేయడంతో భార్య చెప్పేది వినకుండా ఇష్టమొచ్చినట్లు తిట్టాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన ఆమె.. ఇంట్లో ఆత్మహత్య చేసుకుంది. చనిపోయే ముందు సుదీర్ఝమైన సూసైడ్ నోట్ రాసి చనిపోయింది. అయితే ఆమె బలవన్మరణానికి పాల్పడటంతో.. హుటా హుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు చనిపోయిందని తెలియగానే.. అక్కడ నుండి పరారయ్యాడు. చివరకు ఆమె అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదు. కాగా, ప్రతీక్ష తండ్రి అల్లుడిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రీతమ్‌కు పెళ్లికి ముందు ఎఫైర్ ఉందని షాకింగ్ సమాచారం బయటకు వచ్చింది. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా అతడ్ని అరెస్టు చేసిన పోలీసులు.. కోర్టులో హాజరు పరిచారు.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio