iDreamPost
android-app
ios-app

బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హోటల్ రూమ్‌లో ఎంజాయ్.. తెల్లారే సరికి

  • Published Oct 12, 2023 | 12:41 PM Updated Updated Oct 12, 2023 | 12:41 PM
  • Published Oct 12, 2023 | 12:41 PMUpdated Oct 12, 2023 | 12:41 PM
బాయ్ ఫ్రెండ్‌తో కలిసి హోటల్ రూమ్‌లో ఎంజాయ్.. తెల్లారే సరికి

పుదుచ్చేరికి చెందిన యువతి ఉద్యోగం నిమిత్తం తెలంగాణకు వచ్చి హైదరాబాద్‌లోని ఓ హోటల్ రూములో మృత్యువాత పడింది. ఆమె అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె వెంట స్నేహితుడు కూడా ఉండటంతో అనుమానం మరింత బలపడింది. సమాచారం అందుకున్న పోలీసులు.. క్లూస్ టీంతో వివరాలు సేకరించారు. బాధితురాల్ని శ్రావణ ప్రియగా గుర్తించారు. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. శ్రీహరి, శ్రావణ ప్రియ చెన్నైలో ఇంటర్ చదువుకునే నాటి నుండి ఫ్రెండ్స్. శ్రీహరిది చెన్నైలోని అంబటూర్ ప్రాంతం కాగా, ప్రియాది పుదుచ్చురిలోని తట్టంవాడి కామరాజ్ నగర్ ప్రాంత వాసి. కాగా, శ్రావణ ప్రియ.. ఉద్యోగం నిమిత్తం జడ్చరల్లో ఉంటుంది. ఆమె హెటిరో కంపెనీలో జాబ్ చేస్తోంది.

ఈ క్రమంలో శ్రీహరి ఇటీవల ఫ్రెండ్స్ ను కలిసేందుకు హైదరాబాద్ వచ్చాడు. మంగళవారం స్నేహితులతో కలిసి గోల్కోండకు కోటకు వెళ్లాడు. ఈ సమయంలోనే ప్రియకు ఫోన్ చేసి కలుద్దామని చెప్పారు. మాదాపూర్ అయ్యప్ప సొసైటీ రోడ్ నం. 36లో ఉన్న గోల్డెన్ హైవ్ ఓయో హోటల్‌లో రూమ్ బుక్ చేసినట్లు ఆమెకు చెప్పాడు. డ్యూటీ ముగించుకుని మంగళవారం రాత్రి 9 గంటలకు హోటల్ రూమ్‌కు వచ్చింది. ఇద్దరూ కలిసి గదిలో మద్యం తాగారు. అర్థరాత్రి శ్రీహరికి వాంతులు కావడంతో దగ్గరలోని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. హోటల్ రూములో ఉన్న ప్రియా.. బుధవారం ఉదయం ఫుడ్ ఆర్డర్ పెట్టింది. 10 గంటలకు ఫుడ్ ఇచ్చేందుకు డెలివరీ బాయ్ రూమ్ వద్దకు రాగా, ప్రియ స్పందించలేదు. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్ ఫుడ్‌ను హోటల్ రిసెప్షన్‌లో ఇచ్చి వెళ్లిపోయాడు.

ముందు రోజు ఆసుపత్రికి వెళ్లిన శ్రీహరి.. బుధవారం మధ్యాహ్నం 2.30 గంటలకు.. హోటల్ రూంకు వచ్చాడు. రూంలో శ్రావణ ప్రియ నేలపై అచేతనంగా పడి ఉండటం చూసి కంగారు పడి.. హోటల్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించేందుకు అంబులెన్స్ పిలిచారు. అంబులెన్స్ సిబ్బంది శ్రావణ ప్రియను పరిశీలించి చనిపోయినట్లు తెలిపారు. దీంతో హోటల్ సిబ్బంది మాదాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. రూంలో ఉన్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. శ్రీహరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet giriş