iDreamPost

తండ్రిని చంపిన కూతురి కేసులో సంచలన నిజాలు! ఏకంగా ముగ్గురు ప్రియుళ్ళతో!

మదన పల్లెలో తండ్రిని కూతురు అత్యంత ఘోరంగా హత్య చేసిన కేసులో పోలీసులు విస్తుపోయే విషయాలు బయటపెట్టారు. తొలుత తండ్రి కాలుజారి పడిపోయాడని చెప్పగా.. తమదైన స్టైల్లో విచారించగా.. నిజాలను కక్కింది కూతురు.

మదన పల్లెలో తండ్రిని కూతురు అత్యంత ఘోరంగా హత్య చేసిన కేసులో పోలీసులు విస్తుపోయే విషయాలు బయటపెట్టారు. తొలుత తండ్రి కాలుజారి పడిపోయాడని చెప్పగా.. తమదైన స్టైల్లో విచారించగా.. నిజాలను కక్కింది కూతురు.

తండ్రిని చంపిన కూతురి కేసులో సంచలన నిజాలు! ఏకంగా ముగ్గురు ప్రియుళ్ళతో!

తండ్రికి కూతురంటే ప్రాణం. తల్లి కూడా లేకపోవడంతో ఆమె ఆలనా పాలనా అతడిపై పడింది. కూతురు పెళ్లీడుకు వచ్చేయడంతో పాటు తనకు వయస్సు మీద పడటంతో కొన్ని బాధ్యతలను కూతురుకి అప్పగించాడు. బాధ్యతగా ఉండాల్సిన కూతురు పక్కదోవ పట్టింది. ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు యువకులతో రహస్య ప్రేమ కథలు నడిపింది. ఈమె వ్యవహారం గురించి ఇరుగు పొరుగు చెప్పడంతో తండ్రికి తలకొట్టేసినంత పనైంది. వెంటనే ఆమెకు పెళ్లి చేయాలని భావించాడు. సంబంధాలు చూడటం స్టార్ట్ చేశాడు. అయితే తండ్రికి నచ్చ జెప్పేందుకు ప్రయత్నించింది. మీరు తెచ్చిన సంబంధాన్ని చేసుకోనని చెప్పింది. చివరకు తండ్రినే పొట్టనపెట్టుకుంది ఆ తనయ. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో తండ్రిని కూతురు చంపిన హత్య కేసులో విస్తుపోయే విషయాలను వెల్లడించారు పోలీసులు.

తండ్రిని చంపి కాలు జారి కింద పడిపోయాడంటూ కథ చెప్పింది. పోలీసులు రంగంలోకి దిగడంతో నిజం కక్కింది. ఈ ఘటనలో విస్తుపోయే విషయాలను పోలీసులు వెల్లడించారు. మదనపల్లె పీఅండ్‌టీ కాలనీకి చెందిన దొరస్వామి (62), లత భార్యా భర్తలు. వీరికి కూతురు హరిత బీఎస్సీ, బీఈడీ చదివింది. దొరస్వామి దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. భార్య లత ఏడాదిన్నర కిందట అనారోగ్యంతో మృతి చెందింది. అప్పటి నుండి డబ్బు, ఇతర బాధ్యతలు అప్పగించాడు తండ్రి. ఆమె వివాహం కోసం దాచిన డబ్బును కూతురు ఖాతాలోనే వేశాడు. తల్లి నగలు కూడా జాగ్రత్త పెట్టమని ఇచ్చాడు. తల్లి చనిపోవడంతో.. హరితకు అడ్డుచెప్పే వారు లేకుండా పోయారు. అప్పటి నుండి విచ్చలవిడితనం ఎక్కువైంది.

మదనపల్లెకు చెందిన రమేశ్‌తో సన్నిహితంగా మెలుగుతూ.. అతనికి తన బంగారు నగలు అప్పగించింది. అతను వాటిని తాకట్టు పెట్టి రూ.11.40 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. రమేశ్‌తో పాటు సాయికృష్ణ అనే మరో యువకుడికి రూ.8లక్షలు ఇచ్చింది హరిత. ఆ ఇద్దరు యువకులు మాత్రమే కాకుండా హరీశ్‌రెడ్డి అనే మరో వ్యక్తితోనూ సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయం తండ్రికి తెలిసి మందలించాడు. పెళ్లి చేసేయాలని భావించాడు. తాను పెళ్లిచేసుకోనని తేల్చి చెప్పింది కూతురు. ఈ విషయంపై రోజు గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈ నెల 13న పెద్ద గొడవ జరగింది. హరిత ఇంట్లోని చపాతీ కర్ర, పరీక్షలు రాసే అట్ట, తాళంకప్ప, కర్రతో తండ్రిని చితకబాదింది. దీంతో తీవ్ర గాయాలపాలై మరణించాడు. అయితే కేకలు విన్న స్థానికులు వెళ్లి చూడగా..రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. వారికి కాలి జారిపడిపోయినట్లు చెప్పింది. పోలీసులకు సమాచారం అందించారు. వారికి అదే కట్టుకథ అల్లింది. తమదైన స్టైల్లో విచారిస్తే.. రియల్ స్టోరీని బయటపెట్టింది హరిత. పోలీసులు ఆమెను అరెస్టు చేసి.. మరింత విచారిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి