iDreamPost
android-app
ios-app

పెళ్లాన్ని పుట్టింటికి పంపి.. మహిళలతో ఉన్న ఫోటోలు భార్యకు

  • Published Feb 16, 2024 | 12:23 PM Updated Updated Feb 16, 2024 | 12:23 PM

‘నువ్వు లేక నేనుండలేను. నువ్వే నా ప్రాణం’ అంటూ చెప్పిన మాటలకు.. ఫ్లాట్ అయిపోయిందా అమ్మాయి.. చివరకు పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు..

‘నువ్వు లేక నేనుండలేను. నువ్వే నా ప్రాణం’ అంటూ చెప్పిన మాటలకు.. ఫ్లాట్ అయిపోయిందా అమ్మాయి.. చివరకు పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు పిల్లలు పుట్టారు..

  • Published Feb 16, 2024 | 12:23 PMUpdated Feb 16, 2024 | 12:23 PM
పెళ్లాన్ని పుట్టింటికి పంపి.. మహిళలతో ఉన్న ఫోటోలు భార్యకు

’ప్రేమకు అర్థం ఏదంటే నిన్నూ నన్నే చూపిస్తా‘ అంటే ప్రియుడు రాగాలు తీయగానే.. పడిపోయింది ప్రియురాలు. ఇంకేముంది అతడి లవ్ ప్రపోజల్‌కు ఒకే చెప్పింది. ఆ తర్వాత షరామూమూలుగానే చెట్టా పట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో.. ఇంట్లో ప్రేమ వ్యవహారాన్ని చెప్పారు. పెద్దలు అంగీకరించడంతో వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లే ఆరేళ్లు గడిచిపోయాయి. ఇద్దరు బంగారం లాంటి పిల్లలు పుట్టారు. హాయిగా సాగిపోతున్న జీవితంలో.. అతడి మెదడులో పురుగు తొలవడం మొదలు పెట్టింది. భార్యను హింసించడం మొదలు పెట్టాడు. బిడ్డలతో సహా భార్యను పుట్టింటికి పంపించేశాడు. అయితే పిల్లల్ని చూడాలన్న వంకతో అత్తగారింటికి వెళ్లిన భర్త.. దారుణానికి తెగబడ్డాడు.

వాలంటీన్స్ డే నాడు ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అత్యంత కిరాతకంగా హత్య చేశాడు మగడు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ ప్రాంతంలో జరిగింది. కేజీఎఫ్‌లోని సంజయ్ గాంధీ నగర్‌కు చెందిన పవిత్ర, కోరమాండల్ ప్రాంతానికి చెందిన లోకేష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆరేళ్ల పాటు అన్యోన్యంగా సాగిపోయిన వీరి కాపురంలో భర్త పక్కదారి పట్టాడు. జల్సాలకు అలవాటు పడ్డ భర్త..పుట్టింటికి వెళ్లి డబ్బులు తీసుకురావాలంటూ భార్య పవిత్రను హింసకు గురి చేసేవాడు. భార్యను తిట్టి, కొట్టి పుట్టింటికి పంపేశాడు. డబ్బులు తెస్తేనే తన గడప తొక్కాలంటూ వార్నింగ్ ఇచ్చాడు. భార్యను పంపించేశాక మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు.

అంతేకాకుండా.. వారితో కలిసి దిగిన ఫోటోలు భార్యకు పంపి మరింత చిత్ర వధకు గురి చేశాడు. దీంతో విసిగి వేశారిపోయిన భార్య.. రెండేళ్ల క్రితం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపుల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక అతడితో కాపురం చేయలేనని చెప్పిన పవిత్ర.. దూరంగా ఉంటుంది. అయినప్పటికీ.. ఆమెకు వేధింపులు తప్పలేదు. గత వారం కూడా మరోసారి సమస్యను పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో.. భర్త లోకేశ్‌ను పిలిపించి వార్నింగ్ ఇచ్చారు. దీంతో భార్యపై పగ పెంచుకున్న భర్త.. ఆమెను అంతమొందిచాలని భావించాడు. పిల్లల్ని చూడాలని వంకతో ఆమె ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

ఫిబ్రవరి 14న ఆమె  ఇంటికి వెళ్లి.. కొడుకుతో మాట్లాడుతున్నట్లు నటించి.. భార్య పవిత్రపై దాడి చేశాడు. ఆమెను అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం అతడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. పవిత్ర తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు. జీవితాంతం కలిసి ఉంటాని ప్రమాణం చేసి.. డబ్బుకు బానిసగా మారి.. మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుని ప్రశ్నించిన భార్యను.. ప్రేమికుల రోజునే హత్య చేయడం విషాదం.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio