iDreamPost
android-app
ios-app

ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కూతురు ఆ పని! నాన్నకి తెలిశాక!

ఆ తండ్రికి కూతురుంటే విపరీతమైన ప్రేమ. ఒక్కగానొక్క కూతురు కావడంతో గారంబంగా పెంచాడు. తల్లి, తండ్రి ఇద్దరు ఉద్యోగం, పనులు పేరిట బయటకు వెళ్లడంతో.. కూతురు ఒక్కటే ఇంట్లో ఉంది. తల్లి ఇంటికి తిరిగి రాక.. కూతుర్ని అలా చూసి..

ఆ తండ్రికి కూతురుంటే విపరీతమైన ప్రేమ. ఒక్కగానొక్క కూతురు కావడంతో గారంబంగా పెంచాడు. తల్లి, తండ్రి ఇద్దరు ఉద్యోగం, పనులు పేరిట బయటకు వెళ్లడంతో.. కూతురు ఒక్కటే ఇంట్లో ఉంది. తల్లి ఇంటికి తిరిగి రాక.. కూతుర్ని అలా చూసి..

ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో కూతురు ఆ పని! నాన్నకి తెలిశాక!

సాధారణంగా తల్లికి కొడుకు మధ్య బాండింగ్ ఉంటే.. తండ్రికి కూతురుపై ప్రేమ ఉంటుంది. పాప పుట్టగానే మహాలక్ష్మీ అంటు మురిసిపోతాడు. బుడి బుడి అడుగుల బుజ్జాయి తన గుండెలపై తన్నుతుంటే సంబరంలో మునిగిపోతాడు నాన్న. కూతురు ఏడిస్తే తట్టుకోలేదు తండ్రి హృదయం. ఆమె ఎదుగుతుంటే.. అన్నింటిలో మంచి మార్కులు సాధిస్తుంటే చెప్పలేనంత సంతోషం. కూతురి కొండమీద కోతిని అడగాలే కానీ..  ఆలోచన చేయకుండా నిమిషంలో తెచ్చించేంత ప్రేమ అతడిది. కుమార్తె ఉన్నత చదువులు చదివి.. తన కాళ్ల మీద తాను నిలబడాలని కోరుకుంటాడు. ఆమెను ఓ అయ్య చేతిలో పెట్టి.. అత్తారింటికి సాగనంపే సమయంలో చిన్న పిల్లాడి మాదిరి కంటతడి పెట్టుకుంటాడు. ఆమె కష్టనష్టాల్లో తోడుగా నిలుస్తుంటాడు తండ్రి. కూతురికి చిన్న సమస్య వచ్చినా ఆగమేఘాల మీద వచ్చేస్తాడు

సునీల్ కూడా తన కుమార్తె గ్రీష్మపై ఊహించలేనంత ప్రేమ పెంచుకున్నాడు. ఆమె సర్వస్వం అని బతికాడు, కానీ ఏం జరిగిందో ఏమో కూతురు గ్రీష్మ ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఈ విషయం తల్లి.. తండ్రికి ఫోన్ చేసి చెప్పింది. ఆఫీసు నుండి బయలు దేరిన తండ్రి.. ఇంటికి రాలేదు. ఏం జరిగిందో తెలియదు. కూతురు ఆత్మహత్యతో తండ్రి అదృశ్యమైన ఘటన కేరళలోని కొట్టాయం సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చేర్యానాడులో నివసిస్తున్నారు భార్యా భర్తలు సునీల్, గీత. వీరికో కూతురు గ్రీష్మ. మావెలిక్కరలోని ఓ కాలేజీలో చదువుతోంది. సునీల్ కొట్టాయంలోని ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తుండగా.. అమ్మ పాల ఉత్పత్తిదారుల సంఘం కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ గురువారం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో గ్రీష్మ దుశ్చర్యకు పాల్పడింది.

గ్రీష్మ తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బయటకు వెళ్లి వచ్చిన తల్లి.. వచ్చి చూడగా.. ఉరి కొయ్యకు వేలాడుతూ కనిపించింది. వెంటనే భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పింది. ఆఫీసు నుండి హుటాహుటిన బయలు దేరాడు సునీల్. అయితే ఇంటికి రాలేదు. రెండు రోజుల పాటు అతడి కోసం వెతికారు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు.. మొబైల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పరిశీలించగా.. ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో కనుగొనలేకపోయారు. తండ్రి కోసం ఎదురు చూసి చివరకు ఆదివారం కూతురి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు కుటుంబ సభ్యులు. కూతురు లేదని, ఇక రాదని తెలిసి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడేమోనన్న సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తండ్రి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.