పెళ్లి సంబంధాలు చూస్తున్నారని కూతురు దారుణ నిర్ణయం .. గుట్టు చప్పుడు కాకుండా

చదువుకుంటున్న అమ్మాయి.. సమ్మర్ హాలీడేస్ కావడంతో ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు మాత్రం.. పెళ్లి చేయాలని నిర్ణయించారు. సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ విషయం తెలిసిన యువతి..

చదువుకుంటున్న అమ్మాయి.. సమ్మర్ హాలీడేస్ కావడంతో ఇంటికి వచ్చింది. తల్లిదండ్రులు మాత్రం.. పెళ్లి చేయాలని నిర్ణయించారు. సంబంధాలు చూడటం మొదలు పెట్టారు. ఈ విషయం తెలిసిన యువతి..

ఆడపిల్లలు అన్నింటా రాణిస్తున్నారు. కాస్తంత సపోర్టు ఇస్తే చాలు విజయాలు సాధిస్తున్నారు. కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెడుతున్నారు. కానీ ప్రపంచం మారుతున్న ఇంకా పేరెంట్స్ మనస్తత్వాలు మారడం లేదు. పెళ్లీడు వచ్చిందో లేదో ఆడ పిల్లకు పెళ్లి చేసి ఓ అయ్య చేతిలో పెడితే బాధ్యత తీరిపోతుందన్న ఆలోచన తప్ప.. అరే భవిష్యత్తులో ఆమెకు సమస్యలు వస్తే ఎదుర్కొనేలా తన కాళ్లపై తాను నిలబడేలా చేయాలన్న ఆలోచన ఏ కొద్దీ మంది తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. వెరసీ ఇష్టం లేని పెళ్లిళ్లు చేసుకుని.. జీవితాంతం బాధపడుతున్నారు అమ్మాయిలు. తాము పెట్టుకున్న లక్ష్యానికి అడుగు దూరంలో ఆగిపోతున్నారు. పెళ్లి వద్దని చెబితే చాలు.. ఎవరినో లవ్ చేస్తుందన్న ఓవర్ థింకింగ్ కూడా ఈ బలవంతపు పెళ్లిళ్లకు కారణాలు అవుతున్నాయి.

తాజాగా ఓ యువతి తల్లిదండ్రులు ఇష్టం లేని పెళ్లిళ్లు చేస్తున్నారని తీవ్ర నిర్ణయం తీసుకుంది. కలుపు గడ్డి నివారణ మందు తాగి.. చనిపోయింది. ఈ విషయం పోలీసుల దృష్టికి వెళితే.. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుందేమోనని గుట్టు చప్పుడు కాకుండా దహన సంస్కారాలు నిర్వహించారు. కానీ పోలీసులకు సమాచారం వెళ్లింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన పోలీసులు యువతి చనిపోయిన ఆరు రోజులకు పోస్టుమార్టం నిర్వహించడం కోసం మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ ఘటన కాజీపేటలో చోటుచేసుకుంది. కాజీపేట ఏసీపీ తిరుమల్‌ తెలిపిన వివరాలు ఇ లా ఉన్నాయి. వేలేరు మండలం పీచర శివారు గ్రామం వావిలకుంట తండాకు చెందిన బానోతు నారాయణ కూతురు శిరీష (20) ఎస్టీ వసతిగృహంలో ఉంటూ హనుమకొండలోని కేడీసీ డిగ్రీ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఏప్రిల్‌ 24న ఇంటికి వచ్చింది.

చదువు కూడా పూర్తి అయిపోయిందన్న ఉద్దేశంతో ఆమెకు సంబంధాలు చూడటం స్టార్ట్ చేశారు తల్లిదండ్రులు. తనకు ఈ పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఇష్టం లేదని చెప్పినప్పటికీ వాళ్లు సంబంధాలు చూస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష గత నెల 25న ఇంట్లో ఉన్న కలుపు గడ్డి నివారణ మందు తాగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వరంగల్‌ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించింది. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు విషయం చెప్పకుండా.. అదే రోజే అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసుల గత నెల 28న ఈ ఘటనను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. గత నెల 30వ తేదీన పోస్టుమార్టం నిర్వహించడం కోసం ఫోరెన్సిక్ నిపుణులకు గ్రామానికి రప్పించి మృతదేహాన్ని వెలికి తీశారు. తొలుత తల్లిదండ్రులు అంగీకరించలేదు.. తర్వాత అవగాహన కల్పించడంతో ఒప్పుకున్నారు. ప్రస్తుతం విచారణ జరుగుతుందని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు ఉన్నతాధికారులు.

Show comments