ఫేస్ బుక్ ప్రేమ.. ప్రియురాలిని లాడ్జికి పిలిచి..

సోషల్ మీడియా ద్వారా ఆ ఇద్దరికి పరిచయం అయ్యింది. కానీ ప్రియురాలి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశాడు ప్రియుడు. ఓ విషయంపై మాట్లాడాలి అంటూ లాడ్జికి రమ్మన్నాడు.

సోషల్ మీడియా ద్వారా ఆ ఇద్దరికి పరిచయం అయ్యింది. కానీ ప్రియురాలి ప్రవర్తనపై అనుమానం వ్యక్తం చేశాడు ప్రియుడు. ఓ విషయంపై మాట్లాడాలి అంటూ లాడ్జికి రమ్మన్నాడు.

సోషల్ మీడియా ద్వారా కొత్త కొత్త పరిచయాలు చోటుచేసుకుంటున్నాయి. స్నేహాలు, ప్రేమలు చిగురిస్తున్నాయి. పబ్జీ లవ్ స్టోరీలు పుట్టుకొస్తున్నాయి. ఇదే గేమ్‌.. పాకిస్తాన్ మహిళ సీమా హైదర్ జీవితంలో డ్రాస్టిక్ ఛేంజ్ తీసుకు వచ్చింది. తన ప్రియుడి కోసం భర్తను, దేశాన్ని వదిలి పిల్లలతో సహా ఇండియాకు వచ్చి సెటిల్ అయిపోయింది. ఇలా దేశాంతరాలు, ఖండాంతరాల ప్రేమలు, పెళ్లిళ్లు ఇటీవల జరిగాయి. కానీ ఇదే సోషల్ మీడియాలోని మాధ్యమాల వల్ల ఏర్పడ్డ కొన్ని పరిచయాలు విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా అటువంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితం హత్యకు గురైన తల్లీకొడుకుల కేసులో నిందితుడు ఎట్టకేలకు పట్టుబడ్డాడు.

ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఓ వ్యక్తి.. ప్రియురాలిని, ఆమె కొడుకును మట్టుబట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని విజయపురలో చోటుచేసుకుంది. ఏడాది క్రితం జరిగిన డబుల్ మర్డర్ కేసులో ఎట్టకేలకు ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయపురలోని సాయి పార్కులో నివాసమంటున్న సాగర్ లమాని..మైసూరుకు చెందిన జ్యోతి అనే 31 ఏళ్ల మహిళకు ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. జ్యోతికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఆమెతో ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. కొన్నాళ్లకు జ్యోతి ప్రవర్తనపై అతడికి అనుమానం వచ్చింది. దీనిపై ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. అయితే అతడ్ని విడిచి పెట్టి ఉండలేకపోయింది జ్యోతి.  ఈ విషయంపై మాట్లాడదామని  జ్యోతికి ఫోన్ చేసి లాడ్జికి రమ్మని పిలిచాడు సాగర్.

గత ఏడాది మార్చి 13న జ్యోతి ఆమె కుమారుడు రోహన్‌ను తీసుకుని లాడ్జికి వచ్చింది. లాడ్జికి వచ్చాక సాగర్ ప్రియురాలితో గొడవ పడ్డాడు. ఆగ్రహంతో మెడకు చున్నీ బిగించి హత్య చేశాడు. ఈ హత్యను చూసి భయపడ్డ రోహన్‌ను కూడా హతమార్చాడు ఆ కిరాతకుడు. అనంతరం తన స్నేహితుడు లక్ష్మి కాంత్ కుంబార్ సాయంతో తన వెంట తెచ్చిన బ్యాగులో తల్లీ, కొడుకుల మృతదేహాలను కుక్కి.. మహారాష్ట్ర సరిహద్దుల్లోని సిద్దాపూర్ గ్రామ శివారులో ఉన్న బావిలో పడేసి వెళ్లిపోయారు. కొన్ని రోజుల తర్వాత బావిలో సంచలు తేలడంతో.. స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. బ్యాగ్స్ బయటకు తీసి చూడగా.. వీరి మృతదేహాలు కననిపించాయి. అయితే కేసును చేధించలేకపోయారు పోలీసులు.  మైసూరులో జ్యోతి కనబడటం లేదంటూ మిస్సింగ్ కేసు ఫైల్ అయ్యింది. ఆ కేసుకు, ఈ జంట హత్య కేసులకు పోలికలు ఉండటంతో.. జ్యోతి కాల్ లిస్ట్ తీయగా.. సాగర్ విషయం పట్టుబడింది. దీంతో సాగర్, అతడి స్నేహితుడు లక్ష్మి కాంత్‌ను అరెస్టు చేశారు.

Show comments