iDreamPost
android-app
ios-app

ప్రియుడిని ఇంటికి రమ్మని పిలుపు.. నమ్మి ఆమె కోసం వెళ్లగా!

అమృత -ప్రణయ్ ప్రేమలో కులం, మతం అడ్గగీతలు గీసి.. ప్రాణాలు తీసుకుంటే... ఆస్థి, అంతస్థులు కూడా కొన్ని ప్రేమలను శాసిస్తున్నాయి. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు ఆపదలో ఉందని వెళ్లిన ప్రియుడ్ని

అమృత -ప్రణయ్ ప్రేమలో కులం, మతం అడ్గగీతలు గీసి.. ప్రాణాలు తీసుకుంటే... ఆస్థి, అంతస్థులు కూడా కొన్ని ప్రేమలను శాసిస్తున్నాయి. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలు ఆపదలో ఉందని వెళ్లిన ప్రియుడ్ని

ప్రియుడిని ఇంటికి రమ్మని పిలుపు.. నమ్మి ఆమె కోసం వెళ్లగా!

దేశం మారింది, కాలం మారింది.. కానీ మనిషి మాత్రం మారలేదు అని మరోసారి నిరూపితమైంది. పిల్లల ఇష్టా ఇష్టాలను తెలుసుకోకుండా.. తాము పట్టిన కుందేలుకు మూడో కాళ్లు అని కూర్చుంటున్నారు కొంత మంది పెద్ద వాళ్లు. తమ పరువు కోసం పాకులాడుతూ, తాము గీసిందే గీత, తాము ఎవరిని చూపిస్తే.. వారిని పెళ్లి చేసుకోవాలని ఆంక్షలు పెడుతున్నారు. కాదంటే కత్తి దూస్తున్నారు. అమృత- ప్రణయ్ వంటి పరువు హత్యల కేసుల్లో సామాజిక వర్గం పెద్ద పాత్ర పోషిస్తుంటే.. కొన్ని సంఘటనల్లో ఐశ్వర్యం, అంతస్థు కూడా కీలకంగా మారింది. అందుకు ఉదాహరణ ఈ సంఘటన. ప్రేమికులిద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కానీ.. ప్రియుడ్ని బలితీసుకునేలా చేసింది మాత్రం స్టేటస్.

ప్రియుడ్ని తమ అమ్మాయి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని ఆమె కుటుంబ సభ్యులు అతడ్ని సజీవ దహనం చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో చోటుచేసుకుంది. ఇందులో ప్రియురాలి సోదరుడు కీలక పాత్ర పోషించాడు. వివరాల్లోకి వెలితే.. గాడికొప్ప నివాసి అయిన వీరేష్ కుమార్ క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. తండ్రి చనిపోవడంతో తల్లి మాధవితో కలిసి జీవిస్తున్నాడు. అతడికి దూరపు చుట్టమైన అంకితతో పరిచయం ఏర్పడింది. హవేరి జిల్లా హానగల్ తాలూకా అక్కి లూరు గ్రామానికి చెందిన ఆమె ఫార్మసీ చదువుతూ శివమొగ్గలో పీజీలో ఉంటుంది. అంకిత ఐశ్వర్యవంతురాలు. వీరిద్దరూ కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరేష్-అంకితల ప్రేమ వ్యవహారం ఆమె కుటుంబ సభ్యులకు తెలిసింది. అతడ్ని వదులుకోవాలని అంకితకు చెప్పారు. అలాగే వీరేష్ తల్లిని కూడా బెదిరించారు.

పెళ్లైతే తమ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారని భావించారు ఇద్దరు. ఈ విషయంలో ఇరు కుటుంబ సభ్యులకు గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 15న అంకిత పెద్దనాన్న కుమారుడు ప్రవీణ్, తన స్నేహితులతో కలిసి.. వీరేష్ ఇంటికి వచ్చి అతడి ఫోనులో ఉన్న ఫోటోలు డిలీట్ చేయించారు. 6 నెలల తర్వాత పెళ్లి గురించి మాట్లాడతామని హామీనిచ్చి.. నమ్మించి ఫోటోలు తీసేలా చేశారు. ఆమెకు పదే పదే ఫోన్ చేయొద్దంటూ తెలివిగా మాట్లాడారు. అదే రోజు సాయంత్రం అంకిత కుటుంబం నుండి వీరేష్‌కు కాల్ వెళ్లింది. తొగర్సిలోని బంధువుల ఇంటికి రావాలని చెప్పాడు అంకిత సోదరుడు. ఈ విషయాన్ని తల్లికి చెప్పాడు. ఈ రాత్రి పూట వద్దని చెప్పినా వినలేదు.

అంతలో అంకిత కూడా ఫోన్ చేసి ఏదో చెప్పబోతుంటే తాను ఆపదలో ఉందని , వెనకా ముందు ఆలోచించకుండా.. ఫ్రెండ్ కారు తీసుకుని తొగర్సి బయలు దేరారు. అతను వస్తున్న విషయాన్ని తెలుసుకున్న ప్రవీణ్.. అతడి బంధువుల కాపు కాచి.. కారును అడ్డుకుని అనంతరం నిప్పంటించారు. అంకిత ఇంటికి బయలు దేరిన కొడుకు గురించి ఎటువంటి సమాచారం లేకపోవడంతో తల్లి మాధవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులకు.. కారులో కాలిపోయిన మృతదేహం లభ్యమైంది. అది వీరేష్‌ది అని గుర్తించిన పోలీసులు.. నిందితుల్ని పట్టుకున్నారు. మొత్తం ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.