Krishna Kowshik
పెళ్లి నాటి ప్రమాణాలను గంగలో కలిపేస్తున్నారు కొంత మంది భర్తలు. భార్యను అవమానించడం, అనుమానించడమే కాదూ.. మరింత అదనపు కట్నం తీసుకురావాలంటూ హింసిస్తున్నారు. బాధ్యతగా మెలగాల్సిన భర్త.. ఆమె సంపాదనతో ఆధారపడుతున్నాడు.
పెళ్లి నాటి ప్రమాణాలను గంగలో కలిపేస్తున్నారు కొంత మంది భర్తలు. భార్యను అవమానించడం, అనుమానించడమే కాదూ.. మరింత అదనపు కట్నం తీసుకురావాలంటూ హింసిస్తున్నారు. బాధ్యతగా మెలగాల్సిన భర్త.. ఆమె సంపాదనతో ఆధారపడుతున్నాడు.
Krishna Kowshik
‘తన ప్రాణాలే నీవని.. ధర్మేఛగా..ఆ, తన మనసంత నీదని అర్దేచగా.. తన వలపంత నీకని.. కామేఛగా.. అవధులేని ప్రేమకై మోక్షఛగా..ఆ..‘అంటూ అగ్ని హోత్రం చుట్టూ ఏడగులు వేస్తున్న వివాహ బంధం బీటలు వారుతోంది. తల్లిదండ్రులను విడిచిపెట్టి.. భర్తే లోకం, అతడే సర్వస్వం, ఆయనే ప్రపంచం అని బతికేస్తున్న భార్యను చిత్ర హింసలకు గురి చేస్తున్నాడు. అవసరాలకు మించి ఖర్చులు, చెడు అలవాట్లకు లోను కావడం, కుటుంబాన్ని పట్టించుకోకుండా జులాయి తిరుగుతూ బాధ్యతలేని భర్తగా మారిపోతున్నాడు. భార్య నోరు తెరిచి మాట్లాడినా, ఎదురు సమాధానం చెప్పినా, తన దగ్గర ఉన్న సొత్తు ఇవ్వకపోయినా.. ఆమెపై హింసకు పాల్పడుతున్నాడు. అవసరమైతే ప్రాణాలు తీసేస్తున్నాడు కట్టుకున్న వాడు.
ఆస్తి కోసం భార్యను చంపేశాడో కిరాతకుడు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె ళితే. 2013లో పి షణ్ముఖ స్వామి, రాజేశ్వరి దంపతుల కుమార్తె శృతిని.. మండ్య జిల్లా వివి నగర్‌కు చెందిన నాగరాజప్ప కుమారుడు టిఎన్ సోమశేఖర్‌కు ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఇద్దరు పిల్లలు. తొలుత అన్యోన్యంగా సాగిపోయింది వీరి కాపురం. ఆ తర్వాత మనస్పర్థలు రావడం మొదలయ్యాయి. నిత్యం బార్యను వేధించేవారు. కాగా, శృతి తల్లిదండ్రులు షణ్ముఖ్, రాజేశ్వరి రెండేళ్ల వ్యవధిలో మరణించారు. దీంతో వారి పేరిట ఉన్న మూడంతస్థుల భనవం.. శృతికి వచ్చింది. ఈ క్రమంలోనే ఆమె సోదరి సుస్మిత కూడా ఓ ప్రమాదంలో మరణించడంతో.. ఆస్తులన్నీ శృతి పేరు మీదకు బదలాయించారు.
కోట్ల ఆస్తి భార్య పేరు మీద రావడంతో భర్తకు కన్నుకుట్టింది. వాటిని తన పేరు మీదకు మార్చాలంటూ భర్త సోమశేఖర్ వేధించడం మొదలు పెట్టాడు. అలాగే ఆస్తులు అమ్మేందుకు కూడా అంగీకరించలేదు. ఆస్తి తన పేరు మీద మార్చాలేదన్న అక్కసుతో.. ఆమెను చంపేస్తే.. ఆ ఆస్తి అంతా తనకు వస్తుందన్న దురుద్దేశంతో భర్త ఆమెను చంపేసేందుకు ప్లాన్ వేశాడు. శృతి నిద్రిస్తుండగా.. ముఖ్యంపై దిండు, బెట్ షీటు తో గట్టిగా ఊపిరాడకుండా చేసి చంపేశాడు. ఆ తర్వాత సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. శృతి మృతిపై ఆమె బంధువు ఫిర్యాదు చేయడంతో.. భర్త సోమశేఖర్, అత్త నీలాంబికను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసి.. అతడిని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.