Crime News: చెల్లి వేరే మతస్థుడిని ప్రేమించిందని అన్న దారుణం!

చెల్లి వేరే మతస్థుడిని ప్రేమించిందని అన్న దారుణం!

ప్రేమకు అడ్డ గీతలు, నిలువు గీతలు గీసేది తల్లిదండ్రులు, తోబుట్టువులే. ఓ వ్యక్తిని ప్రేమించాను అని చెప్పగానే.. అతడు ఎలాంటి వాడు అని ఎంక్వైరీ కూడా చేయకుండా.. రిజక్ట్ చేస్తుంటారు. మన కులం కాదు, మతం కాదని తెలిస్తే..

ప్రేమకు అడ్డ గీతలు, నిలువు గీతలు గీసేది తల్లిదండ్రులు, తోబుట్టువులే. ఓ వ్యక్తిని ప్రేమించాను అని చెప్పగానే.. అతడు ఎలాంటి వాడు అని ఎంక్వైరీ కూడా చేయకుండా.. రిజక్ట్ చేస్తుంటారు. మన కులం కాదు, మతం కాదని తెలిస్తే..

ప్రేమ ఎప్పుడు ఎవ్వరితో ఎలా పుడుతుందో చెప్పలేం. కుల, మతాలు చూసుకుని ప్రేమ కలగదు. కలిగితే అదే ప్రేమే కాదూ. కానీ ఏ విషయంలోనైనా తల్లిదండ్రులు పిల్లలతో ఏకీభవిస్తుంటారు కానీ.. ప్రేమ, లవ్ చేసిన వ్యక్తులతో పెళ్లి అంటే మాత్రం ససేమీరా అంటున్నారు. ముఖ్యంగా కూతురు మరో మతానికి చెందిన వ్యక్తిని ఇష్టపడ్డా.. తమ కులం వాడిని కాకుండా మరొకరితో కనిపించినా, మాట్లాడినా, లవ్ చేసినా తట్టుకోలేరు. కూతురు ప్రేమించా అని చెప్పగానే.. అతడు ఎలాంటి వాడు అనే ప్రశ్న కన్నా.. అతడిది ఏ కులం, ఏ మతం అంటూ క్వశ్చన్లతో చావగొడుతుంటారు. అతడినే పెళ్లి చేసుకుంటానని కూతురు మొండి కేస్తే ఆమెపై దాడికి యత్నిస్తుంటారు. వీరికి తోడు.. తోబుట్టువులు కూడా తండ్రికే వంత పాడుతూ.. అమ్మాయిని ఒంటరిని చేసి హింసిస్తుంటారు.

సోదరి మరో మతానికి చెందిన వ్యక్తిని ప్రేమించిందన్న ఒక్క కారణంగా సోదరుడు ఇద్దరి నిండు ప్రాణాలను బలిగొన్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో చోటుచేసుకుంది. హిరిక్యాతనహళ్లి గ్రామానికి చెందిన సతీష్, అనిత భార్యా భర్తలు. వీరికి 19 ఏళ్ల ధనుశ్రీ, నితిన్ అనే పిల్లలు ఉన్నారు. ధనుశ్రీ ముస్లిం యువకుడ్ని ప్రేమించింది. ఈ విషయం అన్న నితిన్‌కు తెలిసి ఆవేశానికి గురయ్యాడు. అతడితో ప్రేమ వ్యవహారం మానుకోవాలని అన్నా చెల్లెల్ల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంపై తల్లిదండ్రులు జోక్యం చేసుకుని.. ఇద్దరికీ నచ్చజెప్పేవారు. రోజు ఇలా గొడవలు జరుగుతుండటంతో అతడితో ప్రేమ వ్యవహారం తెగదెంపులు చేసుకోవాలని కూతురికి కూడా సూచించారు తల్లిదండ్రులు.

అయితే సోదరి ఇంకా అతడిని ప్రేమిస్తుందన్న భ్రమలో ఉన్న సోదరుడు ఆమెను చంపేయాలనుకున్నాడు. మంగళవారం సాయంత్రం.. గ్రామంలోని బంధువుల ఇంటికి వెళదామని చెప్పి సోదరి ధనుశ్రీ, తల్లి అనితను బండిపై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. మరూర్ చెరువు వద్ద వాహనాన్ని ఆపి.. సోదరిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి.. సరస్సులోకి నెట్టాడు. ఆ సమయంలో తల్లి అనిత ప్రతిఘటించేందుకు ప్రయత్నించగా.. ఆమెను కూడా నీళ్లలోకి తోసేశాడు. అయితే కొంత సేపటి తర్వాత తల్లి అరుపులు విని.. ఆమెను కాపాడేందుకు ప్రయత్నించాడు కానీ.. అప్పటికే ఆమె చనిపోయింది. తడిసిన బట్టలతో నితిన్ ఇంటికి వెళ్లగా.. తండ్రి ప్రశ్నించడంతో తానే చంపినట్లు చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. నితిన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

తండ్రి సతీష్ చెప్పిన దాని ప్రకారం.. వీరిద్దరికి ఏడు నెలలుగా మాటలు లేవని, సోదరితో గొడవ వద్దని, ఆమెతో గొడవ పెట్టుకుంటే ఇంటికి రావొద్దని చెప్పానని అన్నాడు. దీంతో అతడు ఇంట్లో నుండి బయటకు వెళ్లిపోయి నివసిస్తున్నాడని చెప్పారు. మంగళవారం రాత్రి 9 గంటలకు ఇంటికి వచ్చి.. తమ చుట్టాల్లో ఒకరికి బాగా లేదని, కలవాలని చెప్పాడు. బండిలో పెట్రోల్ కొట్టిద్దామని బయటకు వెళ్లి.. ఇంటికి తిరిగి వచ్చేసరికి భార్య, కుమార్తె లేరని, తిరిగి ఒక్కడే రాగా, వాళ్లేరని కుమారుడిని ప్రశ్నించగా.. హత్య చేసినట్లు చెప్పాడని పేర్కొన్నారు.

Show comments