iDreamPost
android-app
ios-app

తండ్రి కష్టం చూడలేక కూతురు దారుణం

తండ్రి ఆమెపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తనను వ్యాధి హింసిస్తున్నా కూతురుకు తెలియకుండా చికిత్స తీసుకుంటున్నాడు. కూతుర్ని సీఏ చదివించాలని ఓ కాలేజీలో జాయిన్ చేశాడు. కానీ చివరకు

తండ్రి ఆమెపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. తనను వ్యాధి హింసిస్తున్నా కూతురుకు తెలియకుండా చికిత్స తీసుకుంటున్నాడు. కూతుర్ని సీఏ చదివించాలని ఓ కాలేజీలో జాయిన్ చేశాడు. కానీ చివరకు

తండ్రి కష్టం చూడలేక కూతురు దారుణం

ఈ రోజుల్లో ఆడ, మగ అని తేడా లేకుండా సమానంగా చూస్తున్నారు పేరెంట్స్. మగపిల్లవాడు మీద ఎన్ని ఆశలు, ఆకాంక్షలతో బతుకుతున్నారో అలానే ఆడపిల్ల ఆశయాలకు విలువనిస్తున్నారు. తమ పిల్లలు ఎంత వరకు చదువుకోవాలనుకుంటే అంత చదివిస్తారు. అవసరమైతే విదేశాలకు పంపేందుకు వెనకాడటం లేదు. అమ్మాయి తన కాళ్ల మీద తాను నిలబడాలని, ఆర్థిక స్వాతంత్రత ఉండాలని ఉద్యోగాలకు పంపిస్తున్నారు. కూతురికి, ఆమె ఇష్టాలకు విలువనిస్తూ.. తను మానసికంగా, శారీరకంగా స్టెబిలిటీ వచ్చాక..పెళ్లి చేసి అత్తారింటికి సాగనంపుతున్నారు. కుటుంబ సమస్యలు పిల్లలకు తెలియకుండా పెంచాలని ఊవిళ్లూరుతుంటారు. కానీ పిల్లలకు తెలిసి..పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు.

తండ్రి అనారోగ్యం బారిన పడినా.. కూతుర్ని పెద్ద చదువే చదివిస్తున్నాడు. కానీ తండ్రి బాధను చూడలేక.. ఈ పరిస్థితిల్లో అటు చదువుకు బుర్రకెక్కక, మానసిక వేదనతో ఓ సీఏ స్టూడెంట్ ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొప్పతాలూకా హరందూర్ గ్రామంలో నివసిస్తోంది మహేష్ కుటుంబం. భార్య, కూతురు శ్రీనిధి శెట్టితో జీవిస్తున్నాడు. కూతుర్ని మంచి చదువులు చదివించాలని కలలు కన్నాడు. సీఏలో జాయిన్ చేశాడు. ఆమె మంగళూరులోని అల్వాస్ కాలేజీలో సీఏ చదువుతోంది. అయితే తండ్రి అనారోగ్యం బారిన పడ్డాడు. కిడ్నీ సమస్యతో మణిపాల్ ఆసుపత్రిలో చేరాడు. అక్కడ డయాలసిస్ చేయించుకుంటున్నాడు.

తండ్రి నిత్యం ఆసుపత్రి చుట్టూ తిరుగుతుండటాన్ని చూడలేకపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్రీనిధి.. ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో సూసైడ్ చేసుకుంది. ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఇంటికి వచ్చిన తల్లి కూతుర్ని ఆ స్థితిలో చూసి తట్టుకోలేకపోయింది. భర్త పరిస్థితి ఇలా ఉందనుకుంటున్న సమయంలో కూతురు కూడా ఆత్మహత్య చేసుకునే సరికి తల్లి హృదయం తట్టుకోలేకపోతుంది. ఇక తండ్రికి తెలిసి కన్నీరుమున్నీరు అవుతున్నాడు. ఈ ఘటనపై మణిపాల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఉన్నత చదువులు  చదువుకుని మంచి స్థాయిలో నిలబడుతుందని భావించిన తల్లిదండ్రులకు పుత్రికా శోాకాన్ని మిగిల్చింది.