iDreamPost
android-app
ios-app

అతడ్నినమ్మడమే పూజ పాలిట శాపమైంది.. వారం రోజుల తర్వాత

పూజా చాలా మంచి అమ్మాయి.. ఓ సేవా సంస్థలో ప్రతినిధిగా వర్క్ చేస్తుంది. ఎవరీ జోలికి వెళ్లదు. గత నెల 30న ఇంట్లో నుండి వెళ్లిన పూజ ఇంటికి రాలేదు.. తండ్రి వెతికాడు. కానరాలేదు. చివరకు

పూజా చాలా మంచి అమ్మాయి.. ఓ సేవా సంస్థలో ప్రతినిధిగా వర్క్ చేస్తుంది. ఎవరీ జోలికి వెళ్లదు. గత నెల 30న ఇంట్లో నుండి వెళ్లిన పూజ ఇంటికి రాలేదు.. తండ్రి వెతికాడు. కానరాలేదు. చివరకు

అతడ్నినమ్మడమే పూజ పాలిట శాపమైంది.. వారం రోజుల తర్వాత

తల్లిదండ్రులు, అన్నా దమ్ముల బంధాన్ని ఆ దేవుడు సృష్టిస్తే.. స్నేహితులను మాత్రం మనమే చూజ్ చేసుకుంటాం. ఈ లోకంలో అందమైన రిలేషన్ షిప్ ఏదైనా ఉందంటే.. అది ఫ్రెండ్ షిప్పే. అందుకే స్నేహానికి కన్నా మిన్న లోకాన లేదురా అని ఓ సినీ కవి అన్నాడు. కానీ ఈ రోజుల్లో ప్రతి బంధం కూడా కమర్షియల్ అయిపోయింది కల్తీగా మారింది. అందులో మినహాయింపు కాదు ఫ్రెండ్ షిప్ కూడా.  నమ్మిన వ్యక్తినే నట్టేట ముంచడమే కాదు.. బాహుబలిలో కట్టప్ప పొడిచినట్లు.. స్నేహితుడితో సన్నిహితంగా ఉంటూ అతడికే వెన్నుపోటు పొడుస్తున్నాడు. దీనికి ప్రధాన కారణమౌతుంది డబ్బు. డబ్బుకు లోకం దాసోహం అని మరోసారి నిరూపితమైంది.

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి కూడా ఓ ఫ్రెండ్ ముసుగులో పడి చివరకు ప్రాణాలు విడిచింది. నమ్మిన స్నేహితుడే ఆమె పాలిట విలన్ అయ్యాడు. ఇంట్లో నుండి వెళ్లిన పాప ఇంటికి తిరిగి రాలేదని పోలీసులకు తండ్రి ఫిర్యాదు చేయగా.. సుమారు వారం రోజులకు శవమై కనిపించింది.  నిందితుడ్ని పట్టుకుని తమదైన స్టైల్లో విచారిస్తే.. తానే చంపేశానని వెల్లడించాడు. డబ్బుల దగ్గర గొడవై ఇలా చేశానని చెప్పాడు. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.  ధర్మస్థల సంఘం సేవా ప్రతినిధిగా వర్క్ చేస్తుంది పూజా ఏకే (24). మంచి అమ్మాయి అన్న పేరు ఉంది.  జూన్ 30న  పని నిమిత్తం ఇంటి నుండి బయటకు వెళ్లింది.

ఆమె ఇంటికి రాకపోవడంతో  ఆందోళన చెందిన  పూజ తల్లిదండ్రులు అన్ని చోట్ల వెతికారు. అనంతరం తండ్రి  కుశాల్ అగుంబే పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా పూజ మృతదేహం లభ్యమైంది.  తరువాత, పోలీసులు ఆమె ఫోన్ కాల్ డేటాను పరిశీలించగా..ఆమె అదృశ్యమైన చివరి రోజున కాల్ ఎవరికీ చేసిందో గుర్తించారు. ఎంక్వైరీ ఎంతో కాలంగా ఆమెతో స్నేహం చేస్తున్న మణికంఠ అని తేలింది. మణికంఠను అదుపులోకి తీసుకుని విచారించగా.. తొలుత తనకేమీ తెలియదని బుకాయించాడు. ఆ తర్వాత తన దైన స్టైల్లో విచారిస్తే..  తానే పూజను హత్య చేసినట్లు అంగీకరించాడు. డబ్బు విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, దీంతో ఆమెను హత్య చేసి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో వదిలేసినట్లు వెల్లడించాడు.  నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు