iDreamPost
android-app
ios-app

తాగేందుకు బ్యాంకుల నుండి అప్పు.. భార్య నిలదీసిందని ట్విస్ట్!

12 ఏళ్ల క్రితం పెళ్లైంది. భర్తతో రోజు గొడవలే. ఒక రోజు ఊహించని విధంగా ఉరి కొయ్యకు వేలాడింది. నా దేవతను వేధించాను.. భరించలేక చచ్చిపోయిందంటూ ఏడ్వడం మొదలు పెట్టాడు. చివరకు

12 ఏళ్ల క్రితం పెళ్లైంది. భర్తతో రోజు గొడవలే. ఒక రోజు ఊహించని విధంగా ఉరి కొయ్యకు వేలాడింది. నా దేవతను వేధించాను.. భరించలేక చచ్చిపోయిందంటూ ఏడ్వడం మొదలు పెట్టాడు. చివరకు

తాగేందుకు బ్యాంకుల నుండి అప్పు..  భార్య నిలదీసిందని ట్విస్ట్!

సినిమాల ప్రభావం జనాల మీద తీవ్రంగా పనిచేస్తుంది. అయితే మంచి కన్నా, చెడునే ఎక్కువగా స్వీకరిస్తున్నారు. ఇప్పుడు విలనిజం.. హీరోయిజంగా మారిపోయింది. హీరో దొంగతనాలు, దోపిడీలకు పాల్పడుతుంటే ఇన్ స్పైర్ అవుతున్నారు కొందరు. హీరో తాగి వచ్చి గలాటా చేస్తే.. విజిల్స్, చప్పట్లు కొడుతున్నారు. అంతేనా హత్యలు చేసేటప్పుడు ఇచ్చే ఎలివేషన్ వేరు కావడంతో.. ప్రేక్షకులు సాటిస్పై అయ్యి మూవీని సక్సెస్ బాట పట్టిస్తున్నారు. ఇంత వరకు ఓకే కానీ.. నిజ జీవితంలో వాటిని అప్లై చేస్తున్నారు. నేరాలు, ఘోరాలు చేస్తూ తప్పించుకునేందుకు మార్గాలను అన్వేషిస్తున్నారు. భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు భర్త. అందరూ అదే నిజమని నమ్మారు కూడా. ఒక వ్యక్తి అనుమానంతో ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

భార్యను చంపి ఉరేసి.. ఆపై ఆత్మహత్య చేసుకుందంటూ కన్నీళ్లు కార్చాడు. అతడి కన్నీటిని చూసి నిజమేననుకున్నారు స్థానికులు. కానీ మృతురాలి మామ ఇచ్చిన ఫిర్యాదుతో భర్త అసలు బండారం బయట పడింది. భర్తే హంతకుడు అని నిర్ధారించారు పోలీసులు . ఈ ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అరసీకెరె తాలూకాలోని గొల్లర హట్టి గ్రామంలో నివసిస్తున్నారు భార్యా భర్తలు చైత్ర, శంకర లింగప్ప. వీరికి 12 ఏళ్ల క్రితం వివాహామైంది. పెళ్లైన నాటి నుండి భార్యా భర్తల మధ్య తగాదాలు జరుగుతున్నాయి. మద్యానికి బానిసైన శంకర లింగప్ప.. తాగడానికి సహకార సంఘాలు, బ్యాంకుల నుండి అప్పులు తీసుకున్నాడు. అప్పులు వాళ్లు తరచూ అడుగుతుండటంతో.. ఈ విషయంపై చైత్ర, శంకర లింగప్ప మధ్య గొడవలు జరిగేవి.

అంతలో ఈ నెల 14న చైత్ర ఇంట్లో ఉరి వేసుకుని కనిపించింది. భర్త కూడా ‘నా భార్య ఆత్మహత్య చేసుకుని చనిపోయింది’ అంటూ ఏడ్వడం మొదలు పెట్టాడు. బహుశా భర్త తీరుతో విసిగిపోయి బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని భావించారంతా. కాని చైత్ర మామ జయన్న ఆమె మృతిపై అనుమానం వ్యక్తం చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే పోస్టు మార్టంలో అసలు విషయం వెలుగు చూసింది. ఆమె గొంతు నొక్కి చంపడంతో చైత్ర చనిపోయినట్లు గుర్తించారు. వెంటనే భర్త శంకర లింగప్పను అదుపులోకి తీసుకుని విచారించగా నిజం కక్కాడు. భార్యకు తనకు గొడవలు జరుగుతుండటంతో విసిగిపోయి.. గొంతు నులిమి చంపేశానని, ఆ తర్వాత చీరకు ఉరివేసి చంపి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించానని వెల్లడించాడు. దీంతో  స్థానికులకు ఒక్కసారిగా మబ్బులు వీడిపోయాయి.  పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.