iDreamPost
android-app
ios-app

భర్తను వదిలేసి ఒంటరిగా రాధిక.. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ..

భర్తను వదిలేసి.. పిల్లలతో ఒంటరిగా ఉంటుంది రాధిక. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు తమిళనాడుకు చెందిన వ్యక్తి పరిచయం అయ్యాడు.

భర్తను వదిలేసి.. పిల్లలతో ఒంటరిగా ఉంటుంది రాధిక. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఫేమస్ అయ్యేందుకు ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమెకు తమిళనాడుకు చెందిన వ్యక్తి పరిచయం అయ్యాడు.

భర్తను వదిలేసి ఒంటరిగా రాధిక.. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ..

మాయ మాటలకు అమ్మాయిలు ఇట్టే పడిపోతున్నారు. పెళ్లి కానీ, పెళ్లైన మహిళలు సైతం మగవాళ్లు చెప్పే కట్టు కథలకు, కల్లబొల్లి కబుర్లకు లొంగిపోయి సర్వస్వం అప్పగించేస్తున్నారు. మోజు తీరాక.. అతడి అసలు రంగు, స్వరూపం బయటకు వస్తున్నాయి. కానీ అప్పటికే ఆర్థికంగా, శారీరకంగా రెండింటినీ పొగొట్టుకుని లబోదిబోమంటోంది ఆడది. తప్పు ఎవరు చేసినా.. నింద మాత్రం మహిళే మోస్తుంది. సూటి పోటీ మాటలతో వెక్కిరిస్తోంది సమాజం. ఇక భర్తను వదిలేసిన మహిళను అయితే తగిన శాస్త్రి జరిగిందంటూ.. మరింత కుంగదీసే విధంగా ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజాగా ఓ మహిళను ప్రేమ పేరుతో లోబర్చుకుని మోసం చేశాడో దుర్మార్గుడు.

సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతోన్న ఓ మహిళను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి.. ఆమె నుండి భారీ మొత్తంలో వసూలు చేసి పరారయ్యాడో దుర్మార్గుడు. చివరకు ఆమె లబో దిబో మంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన కర్ణాకటలోని కృష్ణ రాజపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాధిక భర్తను విడిచి పెట్టి తన పిల్లలతో విడిగా నివసిస్తోంది. ఫేస్ బుక్, సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉండేది. అలా పరిచయం అయ్యాడు తమిళనాడుకు చెందిన పరమ శివం. ఆ పరిచయం ప్రేమగా మారింది. నిన్ను పెళ్లి చేసుకుంటానని, నీ పిల్లలకు లైఫ్ ఇస్తానంటూ ఆమెను నమ్మించాడు. అతడి మాయ మాటలు నమ్మింది రాధిక.

ఇద్దరూ సహజీవనం చేస్తూనే.. రీల్స్ చేసేవారు. ఈ క్రమంలో మరింత దగ్గరయ్యారు. తనపై రాధికకు నమ్మకం ఏర్పడిన తర్వాత.. మనం కారు కొనుక్కుని, దాన్ని అద్దెకు ఇస్తే మంచి లాభాలు వస్తాయంటూ నమ్మ బలికాడు. ఆమె దగ్గర రూ. 6 లక్షలు తీసుకుని పత్తా లేకుండా పోయాడు. ఇంత వరకు రాకపోవడంతో ఆమె ఎంక్వైరీ స్టార్ చేయగా.. అతడికి మరో పెళ్లి అయినట్లు తెలిసింది. దీంతో తాను మోసపోయాననని గ్రహించిన మహిళ.. ప్రియుడు పరమ శివం, అతడి స్నేహితులు ఐదుగురిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. తనను మోసగించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది రాధిక.. కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ జరుపుతున్నారు.