iDreamPost

భర్త ఆ పని చేయడం లేదని భార్య దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో

దుర్గాప్రసాద్, మమతకు పెళ్లై 11 ఏళ్లైంది. ఒక్కగానొక్క కొడుకు. అయితే ఇక్కడ సరైన పనులు లేకపోవడంతో పరాయి రాష్ట్రంలో పనికి వెళతానని భార్యకు చెప్పాడు. అందుకు భార్య ససేమీరా అని చెప్పింది. అయితే..

దుర్గాప్రసాద్, మమతకు పెళ్లై 11 ఏళ్లైంది. ఒక్కగానొక్క కొడుకు. అయితే ఇక్కడ సరైన పనులు లేకపోవడంతో పరాయి రాష్ట్రంలో పనికి వెళతానని భార్యకు చెప్పాడు. అందుకు భార్య ససేమీరా అని చెప్పింది. అయితే..

భర్త ఆ పని చేయడం లేదని భార్య దారుణం.. ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో

భార్యాభర్తల మధ్య అనుమానాలు పెను భూతంగా మారుతున్నాయి. కొన్ని సార్లు మాటలతోనే కాదు.. మౌనంతో కూడా ఒకరినొకరు బాధపెట్టుకుంటారు. ఒక్క మాటతో మనస్సులోని మాటలు బయటపెట్టొచ్చు కానీ.. మౌనం వల్ల ఇంకా అపార్థాలు పెరుగుతాయి. ఇదిగే ఇదే జరిగింది మమత విషయంలో. స్వస్థలంలో సరైన పనులు లేక ఇబ్బంది పడుతోంది మమత కుటుంబం. పరాయి రాష్ట్రంలో ఉపాధి దొరకుతుందని పిల్లా, బిడ్డలను వదిలేసి వెళ్లాడు భర్త. అక్కడకు వెళ్లాక అతడిలో మార్పులు మొదలయ్యాయి. అక్కడి వెళ్లాక ఫోనులో మాట్లాడేది తగ్గిపోయింది. ఒక్కసారిగా భర్తలో మార్పు చోటుచేసుకుంది. కొడుకుతో కూడా సరిగా మాట్లాడటం లేదు. చివరకు ఇంటికి డబ్బులు కూడా పంపడం లేదని భార్య తీవ్ర మనస్థాపానికి గురైంది.

చివరకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో జరిగింది. గన్నేరువరం ఏఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి దుర్గా ప్రసాద్.. మమత భార్యా భర్తలు. వీరికి 11 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 10 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే ఇక్కడ సరైన పనులు లేకపోవడంతో ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. జార్ఖండ్‌లో పని దొరికిందని భర్త చెప్పగా.. తొలుత మమత ఒప్పుకోలేదు. చివరకు ఆమెను ఒప్పించాడు. నెలకు ఒకసారి ఇంటికి వస్తానని, ప్రతి రోజు ఫోన్ చేస్తానంటూ మమతకు నచ్చజెప్పాడు. అలా రెండు నెలల క్రితం ఆ రాష్ట్రానికి భార్యను బిడ్డను ఇక్కడ వదిలి వెళ్లాడు దుర్గా ప్రసాద్.

జార్ఖండ్‌కి వెళ్లినప్పటి భర్త సరిగా మాట్లాడటం లేదు. కుటుంబ పోషణ కొరకు పైసలు పంపడం లేదని తన తండ్రి టేకు జోగయ్యకు చెప్పి బాధపడేది. తన జీవితం నాశనం అయ్యిందని తలచి ఏడ్చేది. భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో తాను మోసపోయానని రోజూ ఏడ్చేది. ఈ క్రమంలో తీవ్ర మనస్థాపానికి గురైంది. బిడ్డను ఎలా సాకాలి అన్న బాధతో మానసికంగా కుమిలిపోయింది. ఇదే బాధలో సోమవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి టేకు జోగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ లక్ష్మీనారాయణ తెలిపారు. భర్త కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి