iDreamPost
android-app
ios-app

భర్త స్నేహితుడితో భార్య పాడు పని… ఆ వీడియోలు, ఫోటోలు వాట్సప్ స్టేటస్ పెట్టి

ఆపదలో ఆదుకునేవాడు ఫ్రెండ్ అంటారు. కానీ సాయం చేశాను కదా అని ఆసరాగా తీసుకుంటే.. ఇదిగో ఈ సంఘటనలా తయారు అవుతుంది. ఏకంగా ఫ్రెండ్ భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. చివరకు

ఆపదలో ఆదుకునేవాడు ఫ్రెండ్ అంటారు. కానీ సాయం చేశాను కదా అని ఆసరాగా తీసుకుంటే.. ఇదిగో ఈ సంఘటనలా తయారు అవుతుంది. ఏకంగా ఫ్రెండ్ భార్యతోనే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఓ వ్యక్తి. చివరకు

భర్త స్నేహితుడితో భార్య పాడు పని… ఆ వీడియోలు, ఫోటోలు వాట్సప్ స్టేటస్ పెట్టి

పెళ్లికి ముందు ఎన్నైనా ప్రేమ కథలు ఉండొచ్చు కానీ.. వివాహం అయ్యాక లవ్ స్టోరీస్ ఉంటే..సంసార బంధం నైతికత పూర్తిగా దెబ్బతింటుంది. పెళ్లయ్యాక పరాయి వ్యక్తుల మోజులో పడితే.. అది కాపురం అనిపించుకోదు. వివాహేతర సంబంధం/అక్రమ సంబంధంగా పరిగణించబడుతుంది. అయితే ఇటువంటి సంబంధాలకు కోర్టులు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. దీని వల్ల కుటుంబ వ్యవస్థ నాశనం అవుతుంది. ఇదిగో ఇలాంటి తీర్పులు కొంత మంది రెక్కలిచ్చినట్లు అవుతున్నాయి. జీవిత భాగస్వామిని మోసం చేస్తూ.. పరాయి వ్యక్తులతో రాసలీలల్లో మునిగి తేలుతున్నారు. నిజం తెలిసి సరికి దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పుడు భార్య, ఫ్రెండే వెన్నుపోటు పొడిచిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.

భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ.. అతడితో క్లోజ్ ఉన్న ఫోటోలను వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌ పెట్టింది. ఇవి చూసిన భర్త తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. కాంచీపురం జిల్లా పెరునగర్ గ్రామానికి చెందిన కుప్పన్ మకాన్ రామ్‌కుమార్ (వయస్సు 30) ఏడేళ్ల క్రితం జయ సత్య (వయస్సు 25)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమార్తె ఉన్నారు. కాగా వీరి ప్రేమ పెళ్లిని భర్త ఫ్రెండ్ కురలరాసన్ జరిపించాడు. అప్పటి నుండి వీరి ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. జయ సత్య అతడితో చనువుగా ఉండేది. అలా వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. అయితే విషయం తెలుసుకున్న రామ్.. భార్యను, అటు స్నేహితుడ్ని మందలించాడు.

అయితే తమకేదో అవమానం జరిగిందని భావించిన జయ సత్య, కురలరాసన్.. ఇద్దరు చనువుగా తీసుకున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది చూసిన రామ్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఇంటికి వెళ్లి భార్య జయ సత్యను ఈ విషయం గురించి అడిగాడు. భార్య సరిగ్గా స్పందించకపోవడంతో కోపంతో రామ్‌కుమార్‌ తన ఫ్రెండ్ కురలరాసన్‌ వద్దకు ఇదేం పని అని ప్రశ్నించాడు. ఈ విషయంపై ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. రామ్‌కుమార్‌పై కూడా కురలరసన్ దాడి చేసినట్లు చెబుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన రామ్‌కుమార్ వారం రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రాజ్‌కుమార్‌ను బంధువులు.. కాంచీపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. అయితే రామ్ కుమార్ మృతికి కారణమైన వ్యక్తులను అరెస్టు చేయాలంటూ బంధువులు ఆందోళనకు దిగారు. పోలీసులు ఎంట్రీతో ఆ విషయం సద్దుమణిగింది.