Krishna Kowshik
కుటుంబ వ్యవస్థలో కుంపటిలా తయారయ్యాయి వివాహేతర సంబంధాలు. వీటి కారణంగా కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దేశంలో జరుగుతున్న చాలా ఘోరాలు, నేరాలు వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పుడు..
కుటుంబ వ్యవస్థలో కుంపటిలా తయారయ్యాయి వివాహేతర సంబంధాలు. వీటి కారణంగా కుటుంబాలకు కుటుంబాలు నాశనం అవుతున్నాయి. దేశంలో జరుగుతున్న చాలా ఘోరాలు, నేరాలు వీటి చుట్టూనే తిరుగుతున్నాయి. ఇప్పుడు..
Krishna Kowshik
మూడు ముళ్ల బంధానికి తూట్లు పొడుస్తూ.. కొంత మంది పక్క చూపులు చూస్తున్నారు. జీవిత భాగస్వామిని మోసం చేస్తూ.. మరొకరితో వివాహేతర సంబంధాలు నెరుపుతున్నారు. దీని కారణంగా కుటుంబ వ్యవస్థ ఛిన్నాభిన్నంగా మారిపోతుంది. భర్త మరొక స్త్రీని పలకరించినా తట్టుకోలేదు భార్య.వెంటనే అతడికి అన్ననో, తమ్ముడ్నో చేసేస్తుంది. అలాగే పరాయి పురుషుడితో మాట్లాడటం పక్కన పెడితే.. అతడి వంక చూసినా.. భార్యను అనుమానంగా చూస్తాడు భర్త. ఈ అనుమానం పెనుభూతంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతో రోజూ గొడవలు, తన్నుకోవడం చివరకు ఏ దారుణానికైనా దారి తీయొచ్చు. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందన్న చిన్న అనుమానంతోనే.. ఘాతుకానికి ఒడిగట్టాడో భర్త.
కేవలం అనుమానంతో ఓ వ్యక్తి.. ఎవరితో అయితే తన భార్య అక్రమ సంబంధం నెరుపుతుందని భావించాడో.. అతడి తల్లిపై దాడి చేయడంతో మృతి చెందింది. ఈ దారుణమైన ఘటన జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవ్ పూర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అంబట్ పల్లి గ్రామంలో నర్సింహ.. తన భార్య అవినాష్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ అనుమానం పెను భూతంగా మారి.. అవినాష్‌ను చంపేయాలనుకున్నాడు భర్త నర్సింహ. అదును చూసుకుని.. అతడిపై దాడి చేసేందుకు స్కెచ్ వేశాడు.
బుధవారం శివాలయం సమీపంలో అవినాష్ పై నర్సింహ గొడ్డలితో దాడి చేసేందుకు ప్రయత్నించగా.. అతడు తప్పించుకుని పారిపోయాడు. అనంతరం అదే గొడ్డలి తీసుకుని.. అవినాష్ ఇంటికి వెళ్లాడు. కోపంతో వస్తున్న నర్సింహను అడ్డుకుంది అవినాష్ తల్లి పద్మ. దీంతో గొడ్డలితో అవినాష్ తల్లిపై దాడి చేశాడు. ఈ ఘటనలో పద్మ అక్కడిక్కడే మృతి చెందగా.. అవినాష్ పై కూడా గొడ్డలితో దాడి చేయడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అవినాష్ తండ్రి భూమయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. కుమారుడి వివాహేతర సంబంధం కారణంగా తల్లి బలవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.