Krishna Kowshik
నేటి యువత క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని బాధపెడుతూ.. తోబుట్టువులను ఒంటరి చేస్తూ.. తమను తాము బలి తీసుకుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి కఠిన నిర్ణయం తీసుకుంది.
నేటి యువత క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని బాధపెడుతూ.. తోబుట్టువులను ఒంటరి చేస్తూ.. తమను తాము బలి తీసుకుంటున్నారు. తాజాగా ఓ అమ్మాయి కఠిన నిర్ణయం తీసుకుంది.
Krishna Kowshik
చావు ఒక్కటే సమస్యలకు పరిష్కారం కాదు. కానీ కొంత మంది చిన్న చిన్న విషయాలకు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న మందలించాడని బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. లవ్వర్ తన ప్రేమకు ఓకే చెప్పలేదని, ప్రియుడు తనతో బ్రేకప్ చెప్పాడని, ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని కూడా ఇలాంటి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. భార్యా భర్తల మధ్య గొడవలు జరిగినా ఎవరో ఒకరు బలి అయిపోతున్నారు. చివరకు పక్కింటి వాళ్లతో గొడవ జరిగినా కూడా సమస్యను బూతద్దంలో చూసుకుని బలవంతంగా మరణిస్తున్నారు. తాజాగా ఓ అమ్మాయి మార్కులు సరిగా రాలేదని తనువు చాలించింది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో మనస్థాపానికి గురై ఈ నిర్ణయం తీసుకుంది.
చదువుకు మార్కులు కొలమానం కాదు. ఇది తెలియని ఓ పిచ్చి పిల్ల.. ఫెయిల్ అయ్యానన్న ఒక్క కారణంతో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథ పల్లి మండలం అశ్వారావు పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన మస్సి పరమేశ్‌కు ఇద్దరు కుమార్తెలు, కొడుకు సంతోష్ ఉన్నాడు. పంచాయతీ సిబ్బందిగా విధులు నిర్వర్తిస్తూ.. ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నాడు పరమేశ్, రెండో కూతురు సోని (20) జనగామలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇప్పటికే ఫస్ట్, సెకండ్ ఇయర్ సెమిస్టర్ పరీక్షల్లో నాలుగు సబ్జెక్టుల్లో తప్పింది. అయితే ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పలేదు. తనతో తాను కుములిపోతుండేది.
ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం తాను ఇంటర్వ్యూకు హైదరాబాద్ వెళుతున్నాని తమ్ముడు సంతోష్‌తో చెప్పి ఇంటి నుండి బయలుదేరింది. నిజమేననుకున్నారు అంతా. అనంతరం నేరుగా నిడిగొండ బ్రిడ్జి వద్దకు వెళ్లి.. ట్రైన్ కోసం వేచి చూసింది. ట్రైన్ రాగానే దాని కింద పడి ప్రాణాలు పోగొట్టుుంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి వద్ద లభ్యమైన గుర్తింపు కార్డుల ఆధారంగా తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కూతురు రైలు కింద పడి చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. పరీక్షలు, మార్కుల రేసులో కొంత మంది పిల్లలు ఆవేశంలో ఇలాంటి దారుణాలకు తెగబడుతున్నారు. వైఫల్యాలే విజయాలకు సోపానాలుగా మలచుకుని ముందుకు సాగాలి తప్ప.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.