iDreamPost
android-app
ios-app

భార్య బతికి ఉండగానే.. మరో మహిళను

మగ పిల్లవాడు పుట్టలేదని దుర్మార్గుడైన భర్త.. భార్య పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడమే కాకుండా..

మగ పిల్లవాడు పుట్టలేదని దుర్మార్గుడైన భర్త.. భార్య పట్ల దారుణంగా వ్యవహరించాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసించడమే కాకుండా..

భార్య బతికి ఉండగానే.. మరో మహిళను

భారత దేశం సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. దేశ పౌరులు విద్యా వంతులౌతున్నా.. కొంత మంది మెదళ్లలో కొన్నిపురుగులు తొలచడం మాత్రం ఆగడం లేదు. అదే ఆడ, మగ అంటూ వ్యత్యాసం చూపడం. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డల్లో మగ పిల్ల వాడి కోసం పరితపించడం. పుత్రుడు అంటే పున్నామ నరకం నుండి తప్పించే వాడని, తమ వారసత్వాన్ని కాపాడతాడని, తమ ఇంటి పేరు నిలబెడతాడన్న భ్రమలో పడి.. కొడుకు పుట్టాలని కోరుకుంటుంటారు పేరెంట్స్. చదువుకున్న కొంత మంది విద్యావంతులు కూడా ఈ విషయంలో మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. భార్య ఆడ పిల్ల ప్రసవించిందని తెలియగానే.. ఇద్దరిని దూరం పెడుతున్నారు భర్త, ఆమె తరుపు బంధువులు. మరో కాన్పులో కూడా పాపే పుడితే.. వారిని వదిలేసేందుకు కూడా వెనకాడటం లేదు.

కానీ ఈ దుర్మార్గుడు మాత్రం ఆడ పిల్లలు పుడుతున్నారని తెలిసి..  ఏకంగా భార్యకు అబార్షన్లు చేయించాడు. ఇప్పుడు భార్య బతికి ఉండగానే.. మరో పెళ్లికి సిద్దమయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన అమరేందర్ హైకోర్టు అడ్వకేట్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా, అతడు టీఆర్ఎస్ (తెలంగాణ రైతు రాజ్య సమితి) (టీఆర్ఎస్.. బీఆర్ఎస్ మారాక ఏర్పాటు చేసిన పార్టీ ఇది)పార్టీని ఏర్పాటు కూడా చేశాడు. అతడికి పెళ్లై ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. మగ పిల్లవాడు ఉండాలని, తనకు ఇంటి వారసుడు కావాలంటూ.. భార్యకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించలేదు.

అయితే భార్య నాలుగు సార్లు గర్భం ధరించింది. లింగ నిర్ధారణ పరీక్షలు నేరం అయినప్పటికీ.. భార్య గర్భం దాల్చిన ప్రతిసారి ఆమెకు అక్రమంగా లింగ నిర్దారణ పరీక్షలు చేయించాడు. నాలుగు సార్లు ఆమెకు ఆడపిల్ల అని తేలడంతో.. అబార్షన్లు చేయించాడు. ఇక ఆమె ప్రతి సారి ఆడ పిల్లలకు జన్మనివ్వడంతో..కొడుకు కోసం భార్య బతికి ఉండగానే రెండో వివాహం చేసుకున్నాడు. దీంతో ఆమె సరూర్ నగర్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ఇద్దరు ఆడ పిల్లలున్నారని, కొడుకు మీద వ్యామోహంతో భర్త ఆపరేషన్ చేయించలేదని వాపోయింది. నాలుగు సార్లు గర్భం దాల్చగా.. పరీక్షలు చేయించాడని, ఆడ పిల్లలు అని తేలడంతో అబార్షన్ చేయించాడని కన్నీటి పర్యంతం అయ్యింది. చివరక తనను వదిలేసి.. గత నవంబర్ లో మరో మహిళను వివాహం చేసుకున్నట్లు పేర్కొంది. తనను వదిలించుకోవాలని చూస్తున్నాడని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంది.

Jojobet Girişgrandpashabetdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetBets10casibommarsbahis girişjojobet girişjojobet girişdeneme bonusuMadridbetPusulabetPusulabetMadridbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabet